ప్రజాస్వామ్యయుతంగా బాధ్యతలు నిర్వర్తిస్తా : బండ ప్రకాష్

ప్రజాస్వామ్యయుతంగా బాధ్యతలు నిర్వర్తిస్తా : బండ ప్రకాష్

కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని కొత్తగా నియమితులైన శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్ హామీ ఇచ్చారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ గా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్న ఆయన... బలహీనవర్గాల బిడ్డను శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ చేసినందుకు కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పారు. తనపై పెట్టిన బాధ్యతను ప్రజాస్వామ్యయుతంగా నిర్వర్తిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఛైర్మన్ సలహాలు, సూచనల మేరకు సభను నిర్వర్తిస్తానని, తెలంగాణ బిడ్డ రాజ్యసభ సభ్యుడు అయితే ఏమీ చేయగలడో మూడున్నరేళ్లలో చేసి నిరూపించానని చెప్పారు. కేసీఆర్ ఇప్పటికే రాష్ట్రంలో అనేక మంది బాహుబలులను తయారు చేశారన్నారు. కేబినెట్ స్థాయి పదవి ఇవ్వడంతో తన ప్రాధాన్యత పెరిగిందే తప్ప తగ్గలేదని బండ ప్రకాష్ స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలన్న కేసీఆర్ కోరిక మేరకు ఏడాది కాలంగా ప్రజలకు దగ్గరగా ఉండి పని చేస్తున్నానని చెప్పారు.