తిరుమల బ్రహ్మోత్సవాల్లో నిజామాబాద్ పేరిణి సతీశ్ బృందం ప్రదర్శన

తిరుమల బ్రహ్మోత్సవాల్లో  నిజామాబాద్ పేరిణి సతీశ్ బృందం ప్రదర్శన

ఎడపల్లి, వెలుగు: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలోని మాడ వీధుల్లో జరిగిన స్వర్ణ రథం, గజవాహన సేవ కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా, ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ధనిత్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలోని పేరిణి సతీశ్​బృందం ప్రదర్శించిన పేరిణి నాట్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాట్య గురువు సతీశ్​ ఆధ్వర్యంలో 25 మంది కళాకారులు సుమీష, నీల యశశ్రీ, హర్షిత, లక్ష్మీ వైష్ణవి, లక్ష్మీ, త్రిశాల, హాసిని, బి.హర్షిత, సాయిశ్రద్ధ తదితరులు అద్భుత ప్రదర్శనతో భక్తులను మంత్రముగ్ధులను చేశారు.

 మొత్తం 10 రాష్ట్రాల నుంచి 463 మంది కళాకారులు 21 బృందాలుగా పాల్గొన్న గజవాహన సేవ, టీటీడీ సంగీత కళాశాల ఆధ్వర్యంలోని నృత్య కార్యక్రమాలు భక్తులను ఆనంద డోలికల్లో ముంచెత్తాయి. తెలంగాణ, నిజామాబాద్‌కు చెందిన పేరిణి సతీశ్​ బృందానికి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పేరిణి నాట్య ప్రదర్శన నిర్వహించే అరుదైన గౌరవం లభించింది.