
హైదరాబాద్, వెలుగు: తమ ప్లాట్‌ఫారమ్ ద్వారా రూ.2.5 కోట్ల పెట్టుబడితో యూరప్‌లో శాశ్వత నివాసం (పర్మినెంట్ రెసిడెన్సీ) హోదాను పొందవచ్చని లెప్టోస్ ఎస్టేట్స్ తెలిపింది. ప్రస్తుతం రూ.2.5 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చాలని, ఆగస్టు 31 నుంచి ఇది రెట్టింపు అవుతుందని తెలిపింది. తమ ద్వారా గ్రీస్‌లో మెడిటేరియన్ హోమ్‌లో పెట్టుబడి పెట్టి ఈ సదుపాయం పొందవచ్చని పేర్కొంది. శాశ్వత నివాసంతో ఉచిత విద్య, వైద్యంతోపాటు దేశంలో వ్యాపారాన్ని నిర్వహించుకునే అవకాశం దక్కించుకోవచ్చు. ప్రస్తుతం ప్రారంభ పెట్టుబడి 2,50,000 యూరోలు కాగా, ఆగస్టు నుంచి 4,00,000 యూరోలకు పెరుగుతుందని అంచనా.