Pushpa2: వెనకడుగు వేసిన పుష్పరాజ్.. తప్పదు మరి.. పరిస్థితి అలాంటిది..!

Pushpa2: వెనకడుగు వేసిన పుష్పరాజ్.. తప్పదు మరి.. పరిస్థితి అలాంటిది..!

2024లో పుష్ప2 సినిమా మీద ఉన్నన్ని అంచనాలు మరే సినిమా మీద లేవని చెప్పడంలో డౌటే అక్కర్లేదు. నార్త్, సౌత్ తేడా లేకుండా భన్వర్ సింగ్ షెకావత్ వ్యూహాలు, పుష్ప రాజ్ ప్రతివ్యూహాలను వీక్షించేందుకు ప్రేక్షకులు వేయి కళ్లతో డిసెంబర్ 5వ తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే.. ఇంత అంచనాల మధ్య విడుదల కాబోతున్న పుష్ప-2 సినిమాకు సంబంధించిన ఒక విషయంలో పుష్పరాజ్ వెనక్కి తగ్గాడు. అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మార్పు.

పుష్ప-2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేల మంది అభిమానుల సమక్షంలో గ్రాండ్గా నిర్వహించాలని మేకర్స్ భావించారు. అందుకు తొలుత హైదరాబాద్లోని మల్లారెడ్డి కాలేజ్ను వేదికగా ఎంచుకున్నారు. ఆదివారం (డిసెంబర్ 1, 2024) పెద్ద ఎత్తున ఈవెంట్కు ప్లాన్ చేశారు. కానీ.. పుష్పరాజ్ ఈ విషయంలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. మల్లారెడ్డి కాలేజ్ ఆస్తులను ఈడీ అటాచ్ చేయడం, మల్లారెడ్డి కాలేజ్పై ఈడీ రైడ్స్ జరిగిన క్రమంలో పుష్ప--2 ప్రీ రిలీజ్ ఈవెంట్ మల్లారెడ్డి కాలేజ్లో నిర్వహించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో.. పుష్ప.2 ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మారింది. 

ALSO READ : Pushpa2 Movie: గెట్ రెడీ ఫాన్స్.. పుష్ప 2 టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.. ఎలా బుక్ చేసుకోవాలంటే..?

యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో డిసెంబర్ 2న పుష్ప.2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు పుష్ప సినిమా టీం ప్రకటించింది. యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో కూడా పెద్ద సినిమాల ఈవెంట్స్ కొన్ని జరిగినప్పటికీ ‘యానిమల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు మల్లారెడ్డి కాలేజ్లో వచ్చిన రెస్పాన్సే వేరు. మహేశ్ బాబు, రాజమౌళి ముఖ్య అతిథులుగా వచ్చిన ఈ ఈవెంట్కు అంచనాలకు మించిన స్థాయిలో ఫ్యాన్స్ అటెండ్ అవ్వడం గమనార్హం. అంతకు మించిన రెస్పాన్స్ ఆశించి.. అందుకు మల్లారెడ్డి కాలేజ్ సరైన వేదిక అని పుష్ప సినిమా యూనిట్ భావించినప్పటికీ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ అందుకు వేదిక కానుంది. పోలీస్ గ్రౌండ్స్కు కూడా బన్నీ ఫ్యాన్స్, క్రౌడ్ గట్టిగానే వస్తారు గానీ మల్లారెడ్డి కాలేజ్లో పట్టినంత మంది యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్లో పట్టరు.