చంద్రబాబు పేదల ఉసురుపోసుకుంటారు: మాజీ మంత్రి పేర్ని నాని

చంద్రబాబు పేదల ఉసురుపోసుకుంటారు: మాజీ మంత్రి పేర్ని నాని

టీడీపీ అధినేత చంద్రబాబు మాట మార్చి మాట్లాడే నేర్పరి అని, దిగజారి మాట్లాడతారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు ఏనాడైన వృద్దులకు ఇంటికి వెళ్లి పింఛన్ ఇచ్చే వ్యవస్థను తీసుకొచ్చారా అని ప్రశ్నించారు.  వాలంటీర్లు వద్దు అని ఈసీ దగ్గర పైరవీ చేసింది ఎవరంటూ ఆయన ప్రశ్నించారు. వాలంటీర్లు వద్దు అని ఈసీకి లెటర్ ఇచ్చింది టీడీపీ సానుభూతిపరులు కాదా అంటూ ప్రశ్నలు గుప్పించారు. చంద్రబాబుది పెత్తందారి మనస్తత్వమని..వృద్దులకు ఫించన్​ ఇవ్వకుండా అడ్డుకున్నారని పేర్ని నాని అన్నారు. వాలంటీర్లను పక్కన పెట్టమని చెప్పడంతోనే చంద్రబాబు టీం సంబరాలు చేసుకుందని విమర్శించారు. 

చంద్రబాబు జేజమ్మకు కూడా .. పెన్షన్ల పంపిణీ ఆపడం కుదరదనన్న మాజీ మంత్రి పేర్ని నాని .... పేదల ఉసురు పోసుకుని చంద్రబాబు బాగుపడతరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటరీ వ్యవస్థ నడుం విరగ్గొడతామని ఏలూరులో పవన్‌ అన్నారని ఆయన చెప్పుకొచ్చారు. మహిళ అదృశ్యానికి వాలంటీర్లు కారణం అని కూడా పవన్‌ అన్నారని పేర్ని నాని చెప్పారు. మళ్లీ ఇప్పుడు వాలంటీర్ల పొట్ట కొట్టాలని తాను అనుకోవడం లేదని పవన్‌ కల్యాణే అంటున్నారని పేర్కొన్నారు.-  ఇంటింటికి బియ్యం ఇవ్వవద్దని టీడీపీ ఎన్నికల సంఘానికి పిటిషన్ ఇచ్చిందని ఆయన తెలిపారు. సంక్షేమ కార్యక్రమాల అడ్డుకునే ప్రయత్నం ఈ విషపు కూటమి చేస్తుందన్నారు. మళ్లీ సీఎం జగన్‌ రెండోసారి సీఎం కుర్చీలో కూర్చోవడం ఖాయమన్నారు.

ALSO READ :- MI vs RR: బౌల్ట్ దెబ్బకు ముంబై విలవిల.. రాజస్థాన్ టార్గెట్ 126