ఏడాదిగా కోమాలో.. అయినా రెండుసార్లు కరోనా

ఏడాదిగా కోమాలో.. అయినా రెండుసార్లు కరోనా

ఇంగ్లండ్‌‌‌‌లో ఘటన

నాటింగ్‌‌‌‌హామ్‌‌‌‌ (ఇంగ్లండ్): యాక్సిడెంట్‌‌‌‌ జరిగి ఏడాదిగా కోమాలో ఉన్నాడు. కానీ ఆ వ్యక్తికి రెండుసార్లు కరోనా  సోకింది. ఈ సంఘటన ఇంగ్లండ్‌‌‌‌లోని బుర్టనాన్‌‌‌‌ ట్రెంట్‌‌‌‌లో జరిగింది. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌కు మూడు వారాల ముందు జరిగిన కారు యాక్సిడెంట్‌‌‌‌లో బ్రెయిన్‌‌‌‌కు దెబ్బతగలడంతో జోసెఫ్‌‌‌‌ ఫ్లావిల్‌‌‌‌ (19) కోమాలోకి వెళ్లిపోయాడు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంగ్లండ్‌‌‌‌ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఫస్ట్‌‌‌‌టైమ్‌‌‌‌ లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ విధించింది. వైరస్‌‌‌‌ వ్యాప్తి చెందుతున్న కారణంగా హాస్పిటల్‌‌‌‌లో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంటున్న జోసెఫ్‌‌‌‌ వద్దకు పేరెంట్స్‌‌‌‌ సహా ఎవరినీ వెళ్లనీయలేదు. అయినా అతనికి రెండుసార్లు కరోనా వచ్చిందని హాస్పిటల్‌‌‌‌ వర్గాలు తెలిపాయి. జోసెఫ్‌‌‌‌ నెమ్మదిగా రికవర్‌‌‌‌‌‌‌‌ అవుతున్నాడని రిలేటివ్‌‌‌‌ సాలీ ఫ్లావిల్‌‌‌‌ తెలిపారు. అతడు ప్రస్తుతం తాము చేసే సైగలను అర్ధం చేసుకుంటున్నాడని, కళ్లతోనే సమాధానం చెబుతున్నాడన్నారు. ఏడాదిపైగా హాస్పిటల్‌‌‌‌లో ఉంటున్న జోసెఫ్‌‌‌‌ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం అతడి ఫ్యామిలీ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ద్వారా ఫండ్స్‌‌‌‌ కలెక్ట్‌‌‌‌ చేశారని సాలీ చెప్పారు.

For More News..

రాష్ట్రం నుంచి పసుపులోడ్‌తో ఫస్ట్​ కిసాన్‌‌‌‌ రైలు