స్టూడెంట్తో పెండ్లి.. జెండర్​ మార్చుకున్న పీఈటీ టీచర్​

స్టూడెంట్తో పెండ్లి.. జెండర్​ మార్చుకున్న పీఈటీ టీచర్​

జైపూర్​: ప్రేమ ఎంత పనైనా చేయిస్తుందని రాజస్థాన్​కు చెందిన ఓ టీచర్​ నిరూపించింది. స్టూడెంట్​తో ప్రేమలో పడిన పీఈటీ టీచర్.. ఆమెను పెళ్లాడడానికి ఆపరేషన్​ చేయించుకుని అబ్బాయిగా మారిపోయింది. భరత్​పూర్​కు చెందిన మీరా స్థానికంగా ఓ స్కూల్​లో పీఈటీ టీచర్​గా పనిచేస్తోంది. ఈమెకు కల్పనా ఫౌజ్దార్​తో పరిచయం ఏర్పడింది. కల్పన, స్టేట్​ లెవల్​ కబడ్డీ ప్లేయర్​ కావడంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. ఇద్దరూ పెండ్లి చేసుకోవాలనుకున్నారు. దీని కోసం మీరా అబ్బాయిగా మారేందుకు రెడీ అయ్యింది.

ఆరవ్​ కుంతల్​గా పేరు మార్చుకుని.. 2019లో ఫస్ట్​ సెక్స్​ రీ అసైన్​మెంట్​ సర్జరీ(ఎస్ఆర్ఎస్​) చేసుకుంది. ఆ టైంలో హెల్త్​ పరంగా చాలా ఇబ్బందులు పడింది. తర్వాత ఇద్దరి కుటుంబాలు ఓకే చెప్పడంతో పెండ్లి చేసుకున్నారు. ‘‘లవ్​లో ప్రతీది అందంగానే కనిపిస్తుంది. స్కూల్​ ప్లే గ్రౌండ్​లో కల్పన పరిచయమైంది. చూడగానే నచ్చేసింది. ఎలాగైనా పెండ్లి చేసుకోవాలనుకున్నా. నేను అమ్మాయిగా పుట్టినా.. అబ్బాయిలాగే పెరిగా. ఆలోచనలు కూడా అలాగే ఉండేవి. అందుకే జెండర్​ మార్చుకున్నా. కల్పన కోసం 2019లో ఫస్ట్​ ఆపరేషన్​ చేసుకున్నా”అని ఆరవ్​ కుంతల్​ చెప్పాడు. ‘‘నాకు మొదటి నుంచి మీరా అంటే ఎంతో ఇష్టం. సర్జరీ చేయించుకోకపోయినా ఆమెనే పెండ్లి చేసుకునేదాన్ని. సర్జరీ టైంలో మీరాతో నేను కూడా వెళ్లాను’’అని కల్పన చెప్పింది. ఇంటర్నేషనల్​ కబడ్డీ టోర్నీ కోసం జనవరిలో ఆరవ్​తో కలిసి దుబాయ్​కు వెళ్తున్నట్టు కల్పన చెప్పింది.