PUBG నిషేధించండి: హైకోర్టుకు 11ఏళ్ల విద్యార్థి

PUBG నిషేధించండి: హైకోర్టుకు 11ఏళ్ల విద్యార్థి

పబ్ జీ నిషేధించండి: హైకోర్టులో 11ఏళ్ల విద్యార్థి పిటిషన్

పబ్ జి గేమ్ ను నిషేధించాలని ముంబై హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ముంబై కు చెందిన అహద్ నిజాం అనే విద్యార్థి ఇప్పటికే మహారాష్ట్ర సీఎం దేవేంధ్ర ఫడ్నవిజ్, విద్యాశాఖ మంత్రి వినోద్ థావ్డే, హోం మినిష్టర్ శంకర్, సిటీ పోలీస్ కమిషనర్ సుబోద్ జైష్వాల్ కు ఈ విషయంపై లెటర్ రాయగా.. ఇప్పుడు తన తల్లి సహాయంతో హైకోర్టులో పిటీషన్ వేశాడు.

అహద్..ముంబై లోని ఆర్య విద్యామందిర్ లో 6వ తరగతి చదువుతున్నాడు. యువత పబ్ జి గేమ్ వల్ల పెడదారులు పడుతుందని, హింసకు ప్రేరేపితులు అవుతున్నారని అతను రాసిన లేఖలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాడు. ఇటువంటి కంటెంట్ ఉన్న గేమ్ లపై స్పెషల్ ఫోకస్ ఉండేలా చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వనికి ఆర్డర్స్ ఇవ్వమని తన పిటిషన్ లో హైకోర్టును కోరాడు.
ఇదివరకే జమ్మూ కశ్మీర్ స్టూడెంట్ యూనియన్ కూడా పబ్ జి గేమ్ పై చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ ను కోరింది. ఇదిలా ఉంటే గుజరాత్ ప్రభుత్వం మాత్రం ఇప్పటికే ఈ గేమ్ పై నిషేధం విధించింది.