హైదరాబాద్ మహా నగరంలో పెట్రోల్, డీజీల్ ధరలను కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈరోజు (2026, జూలై 28వ తేదీ) తమ ధరల పట్టికను నిర్ణయించింది. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజీల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. పెట్రోల్, డీజీలకు సంబధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాద్ సిటీలో లీటర్ పెట్రోల్ ధర 115.69 రూపాయలుగా ఉండగా.. లీటర్ డీజిల్ ధర 103.82 రూపాయలుగా ఉంది.
ఢిల్లీలో ఇంధన ధరలు పరిశీలిస్తే.. లీటర్ పెట్రోల్ ధర 102.12 రూపాయలుగా ఉండగా.. లీటర్ డీజిల్ ధర 95.20 రూపాయలుగా ఉంది.
ఇక చెన్నై సిటీలో పెట్రోల్ లీటర్ ధర 107.74 రూపాయిలుగా ఉండగా.. డీజిల్ లీటర్ ధర 99.55 రూపాయలుగా ఉంది.
బెంగళూరు సిటీ విషయానికి వస్తే లీటర్ పెట్రోల్ ధర 110.89 రూపాయలుగా ఉండగా.. లీటర్ డీజిల్ ధర 98.80 రూపాయిలుగా ఉంది.
ముంబై సిటీని పరిశీలిస్తే.. లీటర్ పెట్రోల్ ధర 111.21 రూపాయలుగా ఉండగా.. డీజిల్ లీటర్ ధర 97.83 రూపాయిలుగా ఉంది.
ALSO READ : మీ వీడియో డిలీట్ చేసినందుకు క్షమించండి
అమెరికా, ఇరాన్ యుద్ధం జరుగుతుండటం.. హర్మూజ్ జల సంధి దగ్గర ఆయిల్ షిప్స్ రాకపోకలకు అంతరాయం కావటం ఇండియాలో ఆయిల్ దిగుమతులపై ప్రభావం చూపిస్తుంది. దీనికితోడు రూపాయి విలువ తగ్గుతుండటం కూడా ఆయిల్ ధరలు దిగి రాకపోవటానికి కారణంగా చెబుతోంది ప్రభుత్వం.
