ట్రాన్స్ జెండర్ల ఉపాధి కోసం పెట్రోల్ బంక్

ట్రాన్స్ జెండర్ల ఉపాధి కోసం పెట్రోల్ బంక్

రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల జిల్లాలో ట్రాన్స్ జెండర్ల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తున్నట్లు కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. ట్రాన్స్ జెండర్ల ఉపాధి కోసం ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ బంక్ స్థలాన్ని డీడబ్ల్యూఓ లక్ష్మిరాజం ఆదివారం పరిశీలించారు. సిరిసిల్లలోని మెడికల్ కాలేజీ సమీపంలో దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్న ఈ బంక్​కు ఎన్​ఓసీ సర్టిఫికెట్ మంజూరైందని చెప్పారు. దీని ద్వారా 15 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుందన్నారు.