భారత్ లో 74 రోజులుగా పెట్రోల్ రేట్లలో నో చేంజ్

భారత్ లో 74 రోజులుగా పెట్రోల్ రేట్లలో నో చేంజ్

న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్​ మార్కెట్లో పెట్రో ప్రొడక్టుల ధరలు భగ్గుమంటున్నాయి. ఇండియాలో మాత్రం ఎలాంటి మార్పూ కనిపించడం లేదు.  బ్యారెల్​ క్రూడాయిల్​ ధర 87 డాలర్లకు చేరింది. సప్లై కంటే డిమాండ్​ ఎక్కువ కావడం, యూఏఈలోని ఆయిల్ రిజర్వులపై హుతీ తిరుగుబాటుదారులు దాడి చేయడం వంటి పరిస్థితులు ఇందుకు కారణం. ఈ దాడుల వల్ల సౌదీ, ఇరాన్​ మధ్య ఘర్షణలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమకు ఇరాన్ మద్దతు ఉందని హుతీలు చెప్పుకుంటున్నారు. సౌదీ, యూఏఈలు హుతీలకు వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటానికి సాయపడుతున్నాయి. అయితే మనదేశంలో మాత్రం గత 74 రోజుల నుంచి ధరలను పెంచలేదు. ఉత్తరప్రదేశ్​, పంజాబ్​లో ఎన్నికలు ఉండటం వల్ల ధరల పెంపునకు కేంద్రం ఇష్టపడటం లేదని ఎనలిస్టులు చెబుతున్నారు. ఢిల్లీలో ప్రస్తుతం లీటరు పెట్రోల్​ ధర రూ.95.41 కాగా, డీజిల్​కు రూ.86.67 తీసుకుంటున్నారు. ఇందులో ఎక్సైజ్​ డ్యూటీ, వ్యాట్​ కలిసే ఉంటాయి. కేంద్రం ఈ పన్నులను తగ్గించడానికి ముందు, పెట్రోల్ ధర రికార్డుస్థాయిలో లీటర్ రూ. 110.04 ఆల్ టైమ్ హైకి చేరుకుంది.  డీజిల్ ధర రూ. 98.42లకు ఎగిసింది. గత ఏడాది అక్టోబరు 26 న బ్యారెల్‌‌‌‌‌‌‌‌ ధర 86.40 డాలర్లకు చేరింది.  గత నవంబర్ 5న ఇది  82.74 డాలర్లుగా ఉంది. అయితే ధర తగ్గడంతో సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో బ్యారెల్‌‌‌‌‌‌‌‌ ధర 68.87 డాలర్లకు పడిపోయింది. అయితే అప్పటి నుంచి ధరలు పెరగడం ప్రారంభించాయి. తాజాగా  మంగళవారం బ్యారెల్‌‌‌‌‌‌‌‌ క్రూడ్​ ధర 87.7 డాలర్లకు ఎగబాకింది. -  2014 తరువాత ఇదే అత్యధికం. 

గత ఎన్నికల సమయంలోనూ..

గతంలోనూ కీలక ఎన్నికలకు ముందు పెట్రోలు, డీజిల్ ధరల పెంపును కేంద్రం నిలిపివేసింది. అంతర్జాతీయంగా  ధరలు బ్యారెల్‌‌‌‌‌‌‌‌కు దాదాపు  5 డాలర్లు పెరిగినప్పటికీ,  2018 మేలో కర్ణాటక ఎన్నికలకు ముందు పెట్రోల్,  డీజిల్‌‌‌‌‌‌‌‌పై 19 రోజులపాటు ధరలను పెంచలేదు. 2018- మే 14 తర్వాత నుంచి వరుసగా16 రోజులకు పైగా ఆయిల్​ కంపెనీలు ధరలను పెంచాయి.  పెట్రోలు ధర లీటరుకు రూ. 3.8,  డీజిల్ ధర లీటరుకు రూ. 3.38 పెరిగింది. 2017 గుజరాత్​ ఎన్నికల సమయంలో 17 రోజులపాటు ధరలను పెంచలేదు. పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్,  మణిపూర్ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 2017 జనవరి– ఏప్రిల్ మధ్య ఈ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. 2017 జూన్​లో పెట్రో ప్రొడక్టుల రేట్లను పెంచారు. ఆ తరువాత 82 రోజులపాటు ధరలను మార్చలేదు. 2020 నుంచి మార్చి 17 నుంచి జూన్​ ఆరు వరకు కూడా ధరలు యథాతథంగా ఉన్నాయి. ఆ తరువాత పెట్రోల్​పై రూ.10 చొప్పున, డీజిల్​పై రూ.13 చొప్పున ఎక్సైజ్​ డ్యూటీ పెంచారు. గత ఏడాది నవంబరు నుంచి ఇండియా ఆయిల్​ కంపెనీలు రేట్లను మార్చలేదని జేపీ మోర్గన్​ రిపోర్టు పేర్కొంది.   నవంబరులో, డిసెంబరులో ఇంటర్నేషనల్​ మార్కెట్లో ధరలు తగ్గినా, లోకల్​గా మాత్రం తగ్గించలేదని వివరించింది. 

క్రూడాయిల్​ ఫ్యూచర్స్​కు డిమాండ్

క్రూడాయిల్ ధరలు ఎంసీఎక్స్‌‌లో మంగళవారం రూ. 85 పెరిగి బ్యారెల్‌‌‌‌‌‌‌‌కు రూ. 6,318లకు చేరుకున్నాయి. డిమాండ్​ భారీగా ఉండటంతో పార్టిసిపెంట్లు తమ పొజిషన్లను విస్తరించుకున్నారు.  మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌‌‌‌‌‌‌‌లో  జనవరి డెలివరీకి ముడిచమురు ధర రూ. 85   పెరిగి 8,398 లాట్లలో బ్యారెల్‌‌‌‌‌‌‌‌కు రూ. 6,318కి చేరుకుంది. ఫ్యూచర్స్ ట్రేడ్‌‌‌‌‌‌‌‌లో పార్టిసిపెంట్లు బెట్​ పెంచడం వల్ల ముడి చమురు ధరలు ఎక్కువగా ఉన్నాయని ఎనలిస్టులు అంటున్నారు. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ లో ముడి చమురు బ్యారెల్‌‌‌‌‌‌‌‌కు 1.50 శాతం పెరిగి   85.08 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బ్రెంట్ క్రూడ్ న్యూయార్క్‌‌‌‌‌‌‌‌లో 1.09 శాతం పెరిగి బ్యారెల్‌‌‌‌‌‌‌‌కు  87.42 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.