ఇండియాతో పోలిస్తే యూఎస్లో పెట్రోల్ ధరలు తక్కువే

ఇండియాతో పోలిస్తే యూఎస్లో పెట్రోల్ ధరలు తక్కువే

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు గరిష్ట స్థాయిలు నమోదు చేస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో ఇంటర్నేషనల్ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు దడ పుట్టిస్తున్నాయి. యూఎస్ లో పెట్రోల్ ధరలు పద్నాలుగేళ్ల గరిష్టానికి చేరాయి. ఎంత పెరిగినా భారత్ తో పోల్చుకుంటే అమెరికాలో పెట్రోల్ రేట్లు తక్కువగా ఉన్నాయనే చెప్పాలి. 

భారత్లో కంటే చౌక ధరకే..

అమెరికాలో ఫ్యుయల్ను లీటర్లలో కాకుండా గ్యాలన్లలో అమ్ముతారు. గ్యాలన్ దాదాపుగా 3.78 లీటర్లకు సమానం. భారత కరెన్సీ ప్రకారం.. అమెరికాలో ప్రస్తతం లీటర్ పెట్రోల్ ధర రూ.86.97గా ఉంది. ఇండియాలోని పెట్రో రేట్స్ తో పోల్చుకుంటే ఇది తక్కువే. భారత్లోని చాలా సిటీల్లో పెట్రోల్ రూ.100 దాటింది. ప్రస్తుతం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98గా ఉండగా.. ఢిల్లీలో రూ.101.40గా, కోల్ కతాలో రూ.104.67గా ఉంది.  

ముంబైలో కన్నా కాలిఫోర్నియాలోనే ఎక్కువ

భారత్ తో పోలిస్తే యూఎస్ లో పెట్రో ధరలు తక్కువగా ఉన్నప్పటికీ.. అక్కడి పలు స్టేట్స్లో మాత్రం ఇండియన్ సిటీల్లో కంటే ఫ్యూయెల్ రేట్లు భగ్గుమంటున్నాయి. కాలిఫోర్నియాలో లీటర్ పెట్రోల్ రూ.114.82గా, నెవెడాలో రూ.98.27గా, హవాయిలో రూ.97.06గా, ఆరెగాన్ లో రూ.94.85గా, వాషింగ్టన్ లో రూ.94.85గా ఉంది. కాలిఫోర్నియాలో పెట్రోల్ ధర భారత వాణిజ్య రాజధాని ముంబైలో కన్నా ఎక్కువగానే ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109గా ఉండగా.. కాలిఫోర్నియాలో రూ.114గా ఉంది.

మరిన్ని వార్తల కోసం:

రివ్యూ: రాధేశ్యామ్

ఎన్నికల ఫలితాలు చూసి దూకుడు వద్దు

గుజరాత్పై కన్నేసిన ఆమ్ ఆద్మీ