పెట్రోల్ కష్టాలు.. గుర్రంపై జొమాటో ఫుడ్ డెలివరీ

పెట్రోల్ కష్టాలు.. గుర్రంపై జొమాటో ఫుడ్ డెలివరీ

ఫుడ్ డెలివరీ మన జీవితాన్ని చాలా సులభతరం చేసింది. దీని వల్ల మన ఇల్లు లేదా ఆఫీస్ సౌలభ్యం నుంచి ఏదైనా వంటకాన్ని సులభంగా ఆర్డర్ చేయవచ్చు. అయితే, ఈ ఆర్డర్ చేసేటప్పుడు, డెలివరీ ఏజెంట్ పడే కష్టాలను మనలో చాలామంది గుర్తించరు. ఇప్పటి వరకు, ఈ ఏజెంట్లు బైక్‌లపై, సైకిళ్లపై, కాలినడకన కూడా రావడం మీరు చూసి ఉండవచ్చు. కానీ మీకెవరైనా గుర్రం ద్వారా ఫుడ్ డెలివరీ చేశారా? అవును, మీరు చదివింది నిజమే! ఒక జొమాటో డెలివరీ ఏజెంట్ గుర్రంపై ఆహారాన్ని డెలివరీ చేస్తూ కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కఠినమైన జైలు, జరిమానా నిబంధనలకు వ్యతిరేకంగా ట్రక్ డ్రైవర్ల సమ్మె కారణంగా అనేక మంది ప్రజలు పెట్రోల్ పంపుల వద్ద క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో డెలివరీ ఏజెంట్ నగరంలోని రోడ్లపై డెలివరీ చేయడానికి గుర్రపు స్వారీ చేయడానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్లిప్‌ హైదరాబాద్‌కు చెందినదిగా చెబుతున్నారు.  

ఈ వైరల్ క్లిప్ లో రోడ్డుపై వాహనాల ట్రాఫిక్ జామ్ మధ్యలో నుంచి ఓ డెలివరీ పర్సన్ భుజానికి జొమాటో బ్యాగు వేసుకుని, గుర్రంపై స్వారీ చేస్తూ కనిపించాడు. ఈ దృశ్యాన్ని అందరూ వింతగా చూడగా.. కొందరు మాత్రం తమ సెల్ ఫోన్లలో ఈ విచిత్రమైన సంఘటనను రికార్డ్ చేశారు.