
ప్రావిడెంట్ ఫండ్ ఖతాదారులకు షాకిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (EPFO) ప్రావిడెంట్ ఫండ్ (PF) డిపాజిట్ వడ్డీ రేట్లపై కోత విధించింది. 2019 ఆర్థిక సంవత్సరంలో 8.65%గా ఉన్న వడ్డీ రేటును 2020 ఆర్థిక సంవత్సరంలో 8.50% నికి (15 బేసిస్ పాయింట్లు) తగ్గిస్తూ నిర్ణయించింది. PF వడ్డీరేటు కుదింపుపై ఇవాళ( గురువారం,మార్చి 5) సమావేశమైన కేంద్ర ట్రస్టీల బోర్డు (CBT) ఈ నిర్ణయం తీసుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి PF వడ్డీరేటును 8.5 శాతంగా ఉంచినట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ తెలిపారు. పీఎఫ్ వడ్డీ రేటు కోతపై కేంద్ర ప్రభుత్వ లేటెస్టుగా తీసుకున్న నిర్ణయం EPFOలోని 60 మిలియన్ల ఖాతాదారులపై ఎఫెక్ట్ చూపనుంది.