చర్మ వ్యాధి కోసం ఫైజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్లెన్‌‌‌‌‌‌‌‌మార్క్ కొత్త మందు

చర్మ వ్యాధి కోసం ఫైజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్లెన్‌‌‌‌‌‌‌‌మార్క్ కొత్త మందు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: చర్మ వ్యాధి అటాపిక్ డెర్మటైటిస్‌‌‌‌‌‌‌‌ (ఏడీ) చికిత్స కోసం అబ్రోసిటినిబ్ మెడిసిన్‌‌‌‌‌‌‌‌ను  ఫైజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్లెన్‌‌‌‌‌‌‌‌మార్క్ ఫార్మాస్యూటికల్ కలిసి ఇండియాలో లాంచ్ చేశాయి. ఈ డ్రగ్‌‌‌‌‌‌‌‌ను ఫైజర్ డెవలప్ చేసింది. ఇండియాలో అమ్మడానికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్‌‌‌‌‌‌‌‌ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌‌‌‌‌‌‌‌సీఓ) నుంచి అనుమతులు తీసుకుంది.

అంతేకాకుండా ఈ మందుకు  యూఎస్‌‌‌‌‌‌‌‌ ఎఫ్‌‌‌‌‌‌‌‌డీఏ, యూరోపియన్ మెడిసిన్స్‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీ (ఈఎంఏ), ఇతర రెగ్యులేటరీ అనుమతులు కూడా ఉన్నాయని ఫైజర్ పేర్కొంది. ఫైజర్‌‌‌‌‌‌‌‌ జాబ్రస్‌‌‌‌‌‌‌‌ బ్రాండ్ కింద,  గ్లెన్‌‌‌‌‌‌‌‌మార్క్‌‌‌‌‌‌‌‌ సిబినిక్యూ బ్రాండ్‌‌‌‌‌‌‌‌ కింద ఈ మెడిసిన్‌‌‌‌‌‌‌‌ను అమ్మనున్నాయి.