సీఓఈ కోసం చేతులు కలిపిన ఫైజర్, యశోదా హాస్పిటల్స్

సీఓఈ కోసం చేతులు కలిపిన  ఫైజర్,  యశోదా హాస్పిటల్స్

హైదరాబాద్, వెలుగు : అడల్ట్​ వ్యాక్సినేషన్ కోసం కొత్త సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)ని ప్రారంభించేందుకు ఫైజర్ ఇండియా,  యశోద హాస్పిటల్స్ చేతులు కలిపాయి. ప్రతి ఒక్కరికీ వాక్సిన్లు ఇవ్వడానికి సీఓఈను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపాయి. 

 న్యుమోకాకల్ వ్యాధి, ఇన్​ఫ్లూయెంజా, హెచ్​ఐవీ,  హెపటైటిస్ ఏబీ వంటి వ్యాధుల బాధితుల్లో వాక్సిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. భారతదేశంలో 95 శాతం మరణాలను  వ్యాక్సిన్లతో-  నివారించగలమని ఈ  సంస్థలు తెలిపాయి. అయితే టీకాల వినియోగం చాలా తక్కువగా ఉందని పేర్కొన్నాయి.