ఎయిమ్స్ లో మొద‌టి ద‌శ‌ కోవాగ్జిన్ హ్యూమ‌న్ ట్ర‌య‌ల్స్ ప్రారంభం

ఎయిమ్స్ లో మొద‌టి ద‌శ‌ కోవాగ్జిన్ హ్యూమ‌న్ ట్ర‌య‌ల్స్ ప్రారంభం

ఎయిమ్స్ – (ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్) లో క‌రోనా వైర‌స్ ను అరిక‌ట్టేందుకు మొద‌టి ద‌శ కోవాగ్జిన్ మెడిసిన్ ను మ‌నుషులపై ప్ర‌యోగించారు.

ఢిల్లీకి చెందిన 30ఏళ్ల వ్య‌క్తికి ఎయిమ్స్ లో కోవాగ్జిన్ ను ప్ర‌యోగించిన‌ట్లు ఎయిమ్స్ ప్రొఫెస‌ర్, క‌రోనా వైర‌స్ రిసెర్చ్ టీం ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ సంజయ్ రాయ్ తెలిపారు.

ప్ర‌యోగంలో భాగంగా వాలంటీర్ కు రెండు రోజుల క్రితం స్క్రీనింగ్ చేసిన‌ట్లు, ఆ స్క్రీనింగ్ లో అత‌ని ఆరోగ్యం నార్మాల్ ఉంద‌ని చెప్పారు. రెండు రోజుల త‌రువాత అంటే ఈరోజు మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు 0.5ఎమ్ ఎల్ కోవాగ్జిన్ ను అత‌ని న‌రాల్లోకి ఇంజెక్ట్ చేసిన‌ట్లు డాక్ట‌ర్ రాయ్ చెప్పారు. కోవ్యాగ్జిన్ ను ప్ర‌యోగించిన రెండుగంట‌ల త‌రువాత టెస్ట్ లు చేయ‌గా ఆ టెస్ట్ ల్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవ‌ని తెలిపారు. వ్యాక్సిన్ ను ప్ర‌యోగించిన వాలంటీర్ వారం రోజుల పాటు త‌మ అబ్జ‌ర్వేష‌న్ లో ఉంటాడ‌ని, ఇప్ప‌టికే స్క్రీనింగ్ టెస్ట్ లు చేసిన వాలంటీర్ల టెస్ట్ రిపోర్ట్ లు శ‌నివారం త‌రువాత వ‌చ్చే అవకాశం ఉంద‌ని వెల్ల‌డించారు.

ఎయిమ్స్ లో ప్ర‌యోగం

ఇక ఎయిమ్స్ లో కోవాగ్జిన్ హ్యూమ‌న్ ట్ర‌య‌ల్స్ లో పాల్గొనేందుకు 3500వాలంటీర్లు గ‌త శ‌నివారం పేర్ల‌ను న‌మోదు చేసుకున్నార‌ని, వారిలో 22మంది వాలంటీర్లకు స్క్రీనింగ్ టెస్ట్ లు చేసి అబ్జ‌ర్వేష‌న్ లో ఉంచిన‌ట్లు డాక్ట‌ర్ రాయ్ తెలిపారు.

12చోట్ల ప్ర‌యోగాలు

క‌రోనా వ్యాక్సిన్ హ్యూమ‌న్ ట్ర‌యల్స్ కోసం ఢిల్లీ ఎయిమ్స్ తో పాటు మొత్తం 12 రీసెర్చ్ సెంట‌ర్ల ను ఐసీఎంఆర్ (ఇండియ‌న్ కౌన్సిల్ ఫ‌ర్ మెడిక‌ల్ రీసెర్చ్ ) సెలక్ట్ చేసింద‌ని డాక్ట‌ర్ రాయ్ పేర్కొన్నారు. ఈ రీసెర్చ్ సెంట‌ర్ల‌లో మొద‌టి ద‌శ ,రెండో ద‌శ లో కోవాగ్జిన్ ను ర్యాండ‌మ్ గా ప్లాసిబో టెస్ట్ లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు

ప్లాసిబో టెస్ట్ అంటే..?

ఉదాహ‌ర‌ణ‌కు 30మంది వాలంటీర్ల‌ను వ‌య‌సుల వారీగా రెండు గ్రూప్ లుగా డివైడ్ చేసి అంటే ఒక గ్రూప్ లో 15మంది మ‌రో గ్రూప్ లో 15మంది వాలంటీర్లు ఉంటారు . వారిపై డ్ర‌గ్ కానీ వ్యాక్సిన్ ను ప్ర‌యోగిస్తారు.
ఒక గ్రూప్ లో వాలంటీర్ల‌ను, మ‌రో గ్రూప్ వాలంటీర్ల‌తో పోల్చి చూస్తారు. ఆ త‌రువాత వ్యాక్సిన్ డెవ‌ల‌ప్ ను గుర్తిస్తారు. ఈ పద్ద‌తిని ప్లాసిబో అని పిలుస్తారు.

ఎయిమ్స్ లో ఫ‌స్ట్ ఫేజ్ ట్ర‌య‌ల్స్

ఎయిమ్స్ లో నిర్వ‌హించే ఫ‌స్ట్ ఫేజ్ ట్ర‌య‌ల్స్ లో మొత్తం వంద నుంచి 375మంది వాలంటీర్లు పాల్గొంటార‌ని, మిగిలిన 750వాలంటీర్లు రెండో మిగిలిన రీసెర్చ్ సెంట‌ర్ల‌లో ప్ర‌యోగించ‌నున్నారు. ఈ టెస్ట్ ల్లో పాల్గొనేందుకు 1800మంది వాలంటీర్లు త‌మ‌పేర్ల‌ను న‌మోదు చేసుకున్న‌ట్లు ఎయిమ్స్ ప్రొఫెస‌ర్ రాయ్ వెల్ల‌డించారు.

ఫ‌స్ట్ ఫేజ్ లో 18 నుంచి 55 ఏళ్లు, రెండో ఫేజ్ లో 16 నుంచి 65ఏళ్లు

ఫ‌స్ట్ ఫేజ్ లో 18ఏళ్ల నుంచి 55ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న వారిపై ప్ర‌యోగాలు జ‌ర‌ప‌నున్నారు. రెండో ఫేజ్ లో 16 నుంచి 65సంవత్స‌రాల వ‌య‌సున్న 750మంది వాలంటీర్ల‌పై ప్రయోగించ‌నున్నారు.

మూడు ప‌ద్ద‌తుల్లో ప్లాసిబో టెస్ట్ లు

కోవాగ్జిన్ ను మూడు పద్దతుల్లో ప్లాసిబో టెస్ట్ లు చేయ‌నున్నారు. ప్ర‌తీ ప‌ద్ద‌తికి రెండు వారాల వ్య‌వ‌ధి ఉంటుంది. మొద‌టి ద‌శ‌లో పాల్గొనే 50మంది త‌క్కువ మోతాదు ను ప్ర‌యోగిస్తారు. ఈ టెస్ట్ ల్లో వ్యాక్సిన్ ఇచ్చిన వాలంటీర్లు సుర‌క్షితంగా ఉంటే రెండో ప‌ద్ద‌తిలో మ‌రో 50మంది వాలంటీర్ల‌కు ఎక్కువ మొతాదులో ఎక్కిస్తారు. ఇలా మూడు ద‌శ‌ల్లో ర్యాండ‌మ్ గా ప్లాసిబో టెస్ట్ లు చేస్తున్న‌ట్లు ఎయిమ్స్ ప్రొఫెస‌ర్ సంజ‌య్ రాయ్ స్ప‌ష్టం చేశారు.