వీడియో : ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. ఊగిపోయిన బిల్డింగ్స్

వీడియో : ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. ఊగిపోయిన బిల్డింగ్స్

ఫిలిప్పీన్స్‌లోని మిండానావో ప్రాంతంలో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) ప్రకారం, భూకంపం 10 కిలోమీటర్ల (6.2 మైళ్ళు) లోతులో ఏర్పడింది. అయితే ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు మాత్రం అధికారులు ఇంకా వెల్లడించలేదు.

స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:14 గంటలకు (8:14am GMT), ప్రావిన్స్‌లోని సారంగనికి నైరుతి దిశలో 18 మైళ్ల దూరంలో భూకంపం సంభవించింది. అయితే జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ దీన్ని 6.9గా నివేదించగా.. పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం మాత్రం 7.2గా వెల్లడించింది.

మిండనావో ఫిలిప్పీన్స్‌లోని రెండవ అతిపెద్ద ద్వీపంలో దాదాపు 26 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. దావో సిటీ, ఫిలిప్పీన్స్‌లోని మూడవ అతిపెద్ద నగరం కాగా ఇది మిండనావో తీరంలో ఉంది. ఈ ఘటనలో ప్రాణనష్టం గురించిన నివేదికలు ఇప్పటివరకూ వెలువడలేదు.. కానీ ఫిలిప్పీన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వోల్కనాలజీ అండ్ సీస్మాలజీ డైరెక్టర్ టెరెసిటో బాకోల్కోల్ ప్రకారం.. తాజా ప్రకంపనల వల్ల ఆస్తి నష్టం, మరోసారి ప్రకంపనలు రెండూ సంభవించవచ్చు. ఫిలిప్పీన్స్ భూకంప శాస్త్ర ఏజెన్సీ కొన్ని సెకన్ల పాటు భూకంపం కొనసాగిందని చెప్పింది.