UPI Payments:UPI లావాదేవీల్లో ఆగస్టు నాటికి Phonepe 50 శాతం మార్కెట్ వాటాలో అగ్రస్థానంలో ఉంది. యూపీఐ లావాదేవీలు నడిపే Google Pay, Paytm వంటి బలమైన పేమెంట్ ప్లాట్ ఫాంలను వెనకేసి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) డేటా ప్రకారం.. UPI ఆగస్టులో రూ. 20లక్షల 60వేల 735 కోట్ల విలువైన లావాదేవీలు జరపగా.. వీటిలో Phonepe మాత్రమే రూ. 10లక్షల 33వేల 264 కోట్ల లావాదేవీలను నమోదు చేసి వాల్యూమ్ పరంగా 48.36 శాతం మార్కెట్ వాటాను పొందింది.
ఆగస్టులో Google Pay మొత్తం రూ.7లక్షల 42వేల 223కోట్ల లావాదేవాలను నమోదు చేయగా.. Paytm రూ. 1లక్షా 13వేల 672 కోట్ల విలువైన లావాదేవీలను ప్రాసెస్ చేసింది. గూగుల్ పే వ్యాల్యూమ్ వాటా 37.3 శాతం కాగా. పేటీఎం వ్యాల్యూమ్ 7.21 శాతం వాటా కలిగి ఉంది.
Also Read:-TVS Apache 2024 మోడల్ అదుర్స్
జూలై లో Phonpe, Google Pay లావాదేవీల వాటాలు వరుసగా 48.3 శాతం, 37 శాతం ఉండగా.. Paytm లావాదేవీలు 7.82 శాతం వాటాను కలిగి ఉంది. Phonepe, Google Pay లావాదేవీల సంఖ్య పెరిగినప్పటికీ గత నెలలో Paytm వృద్ధి మందగించింది.
మరోవైపు UPI లావాదేవీలు 500 మిలియన్లకు చేరువలో ఉంది. 2026-27 నాటికి ఈ ప్లాట్ ఫాం రోజుకు 1 బిలియన్ లావాదేవాలకు చేరుకుంటుందని (NPCI) అంచనావేస్తోంది.