స్టాక్ బ్రోకింగ్‌‌‌‌‌‌‌‌ బిజినెస్‌‌‌‌‌‌‌‌లోకి ఫోన్‌‌‌‌‌‌‌‌పే.. షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌ తెచ్చిన కంపెనీ

స్టాక్ బ్రోకింగ్‌‌‌‌‌‌‌‌ బిజినెస్‌‌‌‌‌‌‌‌లోకి ఫోన్‌‌‌‌‌‌‌‌పే.. షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌ తెచ్చిన కంపెనీ

న్యూఢిల్లీ : స్టాక్ బ్రోకింగ్ ఇండస్ట్రీలోకి ఫోన్‌‌‌‌‌‌‌‌పే ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యింది. మార్కెట్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌ షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాట్​ మార్కెట్‌‌‌‌‌‌‌‌ లాంచ్ చేసింది. ఫోన్‌‌‌‌‌‌‌‌ఫే స్టాక్‌‌‌‌‌‌‌‌ బ్రోకింగ్ బిజినెస్‌‌‌‌‌‌‌‌కు సీఈఓగా ఉజ్వల్‌‌‌‌‌‌‌‌ జైన్‌‌‌‌‌‌‌‌ నియమితులయ్యారు. బ్రోకింగ్ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇవ్వడంతో అన్ని రకాల ఫైనాన్షియల్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను అమ్ముతున్నామని ఫోన్‌‌‌‌‌‌‌‌పే సీఈఓ సమీర్ నిగమ్ పేర్కొన్నారు. స్టాక్స్‌‌‌‌‌‌‌‌, ఈటీఎఫ్స్‌‌‌‌‌‌‌‌ను షేర్​ డాట్​ మార్కెట్​ ఆఫర్ చేస్తోంది. త్వరలో ఫ్యూచర్స్ అండ్‌‌‌‌‌‌‌‌ ఆప్షన్స్‌‌‌‌‌‌‌‌, ఇతర సెగ్మెంట్స్‌‌‌‌‌‌‌‌ను  అందుబాటులోకి తేనుంది.  షేర్​ డాట్​ మార్కెట్ బ్రాండ్‌‌‌‌‌‌‌‌ను బీఎస్‌‌‌‌‌‌‌‌ఈ మేనేజింగ్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుందరరమణ్‌‌‌‌‌‌‌‌ రామమూర్తి  లాంచ్ చేశారు. 

ప్రస్తుతం పేమెంట్స్‌‌‌‌‌‌‌‌,  బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌, ఇన్సూరెన్స్ సర్వీస్‌‌‌‌‌‌‌‌లను ఫోన్‌‌‌‌‌‌‌‌పే అందిస్తోంది. వ్యాపారులకు అప్పులిస్తున్నామని, త్వరలో కన్జూమర్లకు కూడా అప్పులిస్తామని సమీర్ నిగమ్ పేర్కొన్నారు. ట్రేడర్లు పెరుగుతున్నారని ఉజ్వల్‌‌‌‌‌‌‌‌ జైన్ అన్నారు. ‘షేర్​ డాట్​ మార్కెట్​తో  ఈ గ్రోత్ మరింత ఎక్కువగా ఉంటుందని నమ్ముతున్నాం. టెక్నాలజీ సాయంతో పాటు మాకున్న కస్టమర్ల బేస్‌‌‌‌‌‌‌‌తో మరింత మందికి చేరువవుతాం. డిస్కౌంట్ బ్రోకింగ్ ప్రయోజనాలను  అందిస్తాం’ అని ఆయన వివరించారు. పేటీఎం ఇప్పటికే స్టాక్ బ్రోకింగ్‌‌‌‌‌‌‌‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.