ఫిజికల్ సైన్స్ టీచర్లకు పనిభారం తగ్గించాలి

ఫిజికల్ సైన్స్ టీచర్లకు పనిభారం తగ్గించాలి
  •     విద్యాశాఖ సెక్రటరీకి టీచర్ల వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు హైస్కూళ్లలో ఇటీవల ఫిజికల్ సైన్స్ టీచర్లకు పనిగంటలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఫిజికల్ సైన్స్ టీచర్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ సింగ్ కోరారు. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశంను ఆ ఫోరం నేతలు కలిసి వినతిపత్రం అందించారు. ఇప్పటివరకు ఆరో తరగతి మ్యాథ్స్ సబ్జెక్టును ఫిజిక్స్ టీచర్లు.. ఏడో తరగతి మ్యాథ్స్ సబ్జెక్టును మ్యాథ్స్ టీచర్లు చెప్పేవారని గుర్తుచేశారు. 

కానీ, తాజాగా ఆరు, ఏడు క్లాసుల మ్యాథ్స్ సబ్జెక్టును ఫిజిక్స్ టీచర్లు పిల్లలకు చెప్పాలని ఆదేశాలివ్వడంతో పనిభారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 8, 9, 10 క్లాసులకు కేటాయించిన పీరియడ్లు సరిపోక.. ఎక్స్ ట్రా క్లాసులు తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు. తమకు సంబంధం లేని ఆరు, ఏడు క్లాసుల మ్యాథ్స్ సబ్జెక్టును కేటాయించడం సరికాదన్నారు. ఉన్నత చదువులకు ఫిజికల్ సైన్స్ కీలకమన్నారు. ఆర్సీ నంబర్ 77ను అమలు చేసి.. అందరికీ న్యాయం చేయాలని కోరారు.