ఫిజిక్స్​ టీచర్స్​ వెల్ఫేర్​ అసోసియేషన్​క్యాలెండర్ ​ఆవిష్కరణ

ఫిజిక్స్​ టీచర్స్​ వెల్ఫేర్​ అసోసియేషన్​క్యాలెండర్ ​ఆవిష్కరణ

హైదరాబాద్​, వెలుగు: ఫిజిక్స్​ టీచర్స్ వెల్ఫేర్​అసోసియేషన్ (పీటీడబ్ల్యూఏ)​ ఆధ్వర్యంలో  న్యూ ఇయర్​ క్యాలెండర్ ​ఆవిష్కరణ జరిగింది. ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ గెస్ట్​ హౌస్​లో  నిర్వహించిన పీటీడబ్ల్యూఏ సమావేశంలో హైదరాబాద్​ సెంట్రల్​యూనివర్సిటీ ఫిజిక్స్​ ప్రొఫెసర్ ఎస్​. శ్రీనాథ్​​ఆవిష్కరించి పీటీడబ్ల్యూఏ కృషిని అభినందించారు. అసోసియేషన్​ అభివృద్దికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుదని ఆయన హామీ ఇచ్చారు. కరోనా కష్టాల్లో సహ అధ్యాపకులకు సాయం చేయాలనే ఉద్ధేశంతో ప్రైవేట్ఇంజనీరింగ్ కాలేజీల్లోని కొంతమంది ఫిజిక్స్ టీచర్స్​2021లో పీటీడబ్ల్యూఏను స్థాపించారు.

ఆపదలో ఉండే ఫిజిక్స్ టీచర్స్​కు సాయం చేయడం, జేఎల్, పీఎల్​ఔత్సాహికులకు కోచింగ్​ఇవ్వడం, రీసెర్చ్​ సెమినార్స్​ను నిర్వహణలో అసోసియేషన్​ కీలకపాత్ర పోషిస్తుంది. ఈ సమావేశంలో పీటీడబ్ల్యూఏ ప్రెసిడెంట్ ​ప్రొ. ఎన్​. వరలక్ష్మి, జనరల్​ సెక్రటరీ ఎన్​. జహంగీర్, ఓయూ ఫిజిక్స్​ డిపార్ట్​మెంట్ ​హెడ్​ఎం. శ్రీనివాస్​, ఉపేందర్,​ శ్రీనాథ్​, ఎం. ప్రసాద్, బి. రవీందర్ రెడ్డి, సురేష్ ​శ్రీపాద(జేఎన్​టీయూ), నటరాజు(సీబీఐటీ)  పాల్గొన్నారు.