ఎడ్ టెక్ యూనికార్న్..ఫిజిక్స్ వాల్లా లేఆఫ్స్ ప్రకటించింది.. ఉద్యోగుల పనితీరే కారణమట..

ఎడ్ టెక్ యూనికార్న్..ఫిజిక్స్ వాల్లా లేఆఫ్స్ ప్రకటించింది.. ఉద్యోగుల పనితీరే కారణమట..

ఇండియన్ ఎడ్ టెక్ యూనికార్న్ పిజిక్స్ వాల్లా తాజాగా తన 120 కంపెనీ ఉద్యోగులను తొలగించింది. దేశంలో ప్రముఖ ఎడ్ టెక్ సంస్థల్లో ఒకటైన ఫిజిక్స్ వాల్లా.. ఉద్యోగుల తొలగింపు వారి పనితీరు సమీక్షలో భాగమని, ఖర్చు తగ్గించే చర్య కాదని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 

ఫిజిక్స్ వాల్లాలో చీఫ్ హ్యూమన్ రీసోర్సెస్ ఆఫీసర్ సతీష్ ఖేంగ్రే మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ వర్క్ లో మిడ్ టర్మ్, ఎండ్ టర్మ్ సైకిల్స్ ద్వారా పనితీరును అంచనావేస్తాం.. అక్టోబర్ ముగిసే నాటికి పనితీరు సరిగాలేని 120 మంది ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించామని తెలిపారు. రాబోయే రోజుల్లో అదనంగా 11వందల మంది ఉద్యోగులను నియమించుకోవాలని కంపెనీ యోచిస్తోందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న మా ఉద్యోగుల అంకిత భావానికి మేం చాలా విలువ ఇస్తాం.. విద్యాసాంకేతిక భవిష్యత్ రూపొందించడంలో వారి సమగ్ర పాత్రను గుర్తించామన్నారు అని Edtech సీహెచ్ ఆర్ వో తెలిపారు.

గతేడాది నుంచి ఎడ్ టెక్ సెక్టార్ లో అత్యధికంగా ఉద్యోగుల తొలగింపులు జరిగాయి. ఎందుకంటే ఎడ్ టెక్ రంగంలో నిర్వాహకులు లాభాలను చవి చూడలేదు. నిధుల కొరత మధ్య ఖర్చు తగ్గింపు చర్యలలో భాగంగా ఉద్యోగులను తొలగించాయి. బైజూస్, అనాకాడెమీ, వేదాంటు, క్యూమత్, టీచ్ మింగ్ వంటి అనేక సంస్థలు దాదాపు 10 వేల మంది ఉద్యోగులను తొలగించాయి.