OTT MOVIES : లేడీ డిటెక్టివ్

OTT MOVIES : లేడీ డిటెక్టివ్

లేడీ డిటెక్టివ్ 

టైటిల్ : పి.ఐ మీనా (వెబ్ సిరీస్)

డైరెక్షన్​ : ​దబలొయ్ భట్టాఛార్య

కాస్ట్​ : తాన్యా మణిక్తల, పరంబ్రత ఛటోపాధ్యాయ, వినయ్ పాతక్, హర్ష్​ ఛయ, సౌరవ్ దాస్, జిషు సేన్​గుప్తా, జరీనా వాహబ్, విపిన్ శర్మ

లాంగ్వేజ్ : హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం

ప్లాట్​ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో

మీనా (తాన్య మణిక్తల) ప్రైవేట్ డిటెక్టివ్. కోమాలో ఉన్న తన బ్రదర్ జాయ్​కి సంబంధించిన గతం ఆమెను వెంటాడుతుంటుంది. అయినప్పటికీ ఇన్వెస్టిగేషన్​ మాత్రం లోతుగా చేస్తుంటుంది. మీనా బాస్​ ప్రీతమ్ సేన్ (హర్ష్​ ఛయ). సుభోరాయ్ (పరంబ్రత ఛటర్జీ) మీనా భర్త. అతనికి మీనా అంటే చాలా ప్రేమ. అలాగే అతనికి రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆసక్తి ఉంటుంది. కానీ, ప్రజలకు సేవ చేయాలని కాదు. ఇలా ఉండగా.. మీనా కళ్ల ముందే ఓ యాక్సిడెంట్ జరుగుతుంది. పార్దో దేయ్ (సావోన్ చక్రవర్తి) బైక్​ని ఒక లారీ ఢీ కొడుతుంది. అది చూసి షాక్​ అయిన మీనా వెంటనే పార్తోని హాస్పిటల్​కి తీసుకెళ్తుంది. పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేస్తుంది. దీంతో పార్దో వాళ్లమ్మ ‘ఇది చిన్న విషయం కాదు. తన కొడుకుని చంపడానికి యాక్సిడెంట్​ చేశార’ని చెప్తుంది. దాంతో మీనా రంగంలోకి దిగి, ఇన్వెస్టిగేషన్ మొదలుపెడుతుంది. ఈ క్రమంలో డాక్టర్ ఆండ్రే రక్ష (జిషు సేన్​గుప్తా)ను కలుస్తుంది. ఆ తర్వాత కథేంటి? అనేదే ఈ వెబ్​ సిరీస్​ సారాంశం. మీనా పర్ఫార్మెన్స్​ ఎలా ఉన్నా, సిరీస్​ కాస్త సాగదీతలా అనిపిస్తున్నా సరే.. ఒక ఇన్వెస్టిగేటివ్​ థ్రిల్లర్ వెబ్​ సిరీస్​ చూడాలి అనుకుంటే దీన్ని చూడొచ్చు. 

ఆమె చావుకి కారణం ఎవరు?

టైటిల్ : ఛోటోలోక్

డైరెక్షన్​ : ​ఇంద్రనీల్ రాయ్ చౌదరి​

కాస్ట్​ : దామినీ బెన్నీ బసు, ఇంద్రాని హల్దర్, ప్రియాంక సర్కార్, గౌరవ్ చక్రవర్తి, ఉశసీ రే

లాంగ్వేజ్ : బెంగాలీ​

ప్లాట్​ ఫాం : జీ5

రాజా (గౌరవ్ చక్రవర్తి) పెండ్లి అయిన వ్యక్తి. కానీ రూప్షా (ఉశసీ రే) అనే ఆమెతో అఫైర్ నడుపుతుంటాడు. ఆమెకి ఎవరికీ తెలియని గతం ఉంటుంది. ఆమె చనిపోవడంతో ఆ కేసులో రాజా చిక్కుకుంటాడు. ఆ కేసుని ఎస్సై సబిత్రి మొండొల్ (దామినీ బెన్నీ బసు)  టేకప్​ చేస్తుంది. ఆమె ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడంతో రూప్షా గురించిన విషయాలన్నీ ఒక్కోటిగా బయటకొస్తుంటాయి. ఆ క్రమంలో రాజా, భార్య మల్లిక (ప్రియాంక సర్కార్)లతోపాటు రాజకీయ పలుకుబడి ఉన్న రాజా తల్లి మొహర్(ఇంద్రాని హల్దర్)లను కలుస్తుంది. ఆ తర్వాత కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది మిగతా కథ.

మరపురాని ప్రేమ 

టైటిల్ : త్రీ ఆఫ్​ అజ్

డైరెక్షన్​ : అవినాశ్​ అరుణ్​

కాస్ట్​ : షెఫాలీ షా, జైదీప్ అహ్లావత్, స్వనంద్​ కిర్కిరె, కాదంబరి కదమ్, పాయల్ జాదవ్

లాంగ్వేజ్ : హిందీ

ప్లాట్​ ఫాం : అమెజాన్ ప్రైమ్​ వీడియో

శైలజ (షెఫాలీ షా)ది మహారాష్ట్రలో కొంకణ్​. పెండ్లి అయ్యాక భర్త దీపంకర్ (స్వనంద్ కిర్కిరె)తో కలిసి ముంబైలో ఉంటుంది. అయితే శైలజకి డిమెన్షియా అనే డిజార్డర్​ స్టార్టింగ్​ స్టేజిలో ఉంటుంది. దానివల్ల  తన భవిష్యత్​ ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. అందుకని ఆమె గతాన్ని మర్చిపోక ముందే తన చిన్నప్పటి రోజుల్ని గుర్తుచేసుకోవాలి అనుకుంటుంది. అందుకోసం భర్తతో కలిసి కొంకణ్​ వెళ్తుంది. అక్కడ తను చదువుకున్న స్కూల్​కు వెళ్తారు. చిన్నప్పటి స్నేహితులను కలుసుకుంటారు. అలా తిరుగుతూ ఒకరోజు పని మీద బ్యాంక్​కి వెళ్తే..  అక్కడ వాళ్లకు  ప్రదీప్ (జైదీప్ అహ్లావత్) కనిపిస్తాడు. ఇదే ఇక్కడ ట్విస్ట్​! ఎందుకంటే అతనెవరో కాదు.. శైలజ చిన్నప్పుడు ఇష్టపడ్డ వ్యక్తి. మరి శైలజ, ప్రదీప్​ని కలిసిన తర్వాత కథ ఏ మలుపు తిరుగుతుంది? అసలు వాళ్లిద్దరు ఎందుకు విడిపోయారు? శైలజ గతం మర్చిపోతుందా? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమాటోగ్రాఫర్ నుంచి డైరెక్టర్​గా మారిన అవినాశ్​ ఈ సినిమాని తెరకెక్కించాడు. ఇందులో చిన్న చిన్న డైలాగ్​లే ఉన్నా అవి ఆలోచింపజేస్తాయి. ఎమోషనల్​గా హార్ట్​ టచ్​ చేసే సినిమా ఇది.