
పియాజ్యో ఇండియా త్వరలో లాంచ్ చేయనున్న ప్రీమియం స్కూటర్ ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్ 160 ప్రీ బుకింగ్స్ ప్రారంభించింది. రూ.5 వేలు కట్టి ఈ వెహికల్‌ను తమ ఈ–కామర్స్ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చని చెప్పింది. లేదా దగ్గర్లోని ఏప్రిలియా డీలర్‌షిప్ వద్ద కూడా బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. పూణే బారామతి ప్లాంట్‌లో దీన్ని తయారు చేసింది. ఈ వెహికల్‌ను ప్రత్యేకంగా ఇండియా కోసమే ఇటలీలో డిజైన్ చేసింది. ప్రీమియం టూవీలర్ సెగ్మెంట్‌లో ఇది కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టించనుంది.