మెట్రోలో జేబుదొంగ: ఆర్మీ పర్సు కొట్టేద్దామనుకున్నాడు..దొరికాడు..తన్నులు తిన్నాడు

మెట్రోలో జేబుదొంగ: ఆర్మీ పర్సు కొట్టేద్దామనుకున్నాడు..దొరికాడు..తన్నులు తిన్నాడు

అతన్ని చూస్తే ఎవ్వరికి అనుమానం రాదు.. దొంగని.. ఖతర్నాక్ జీన్స్, ఖరీదైన జాకెట్.. షూస్.. చూస్తే ఎవ్వరు ఇతను దొంగ అని అనుకోరు.  మెట్రో రైల్లో ఎక్కాడు. కంపార్ట్ మెంట్ రద్దీగా ఉంది..ఇదే అదనుగా తన చేతివాటం చూపించేందుకు ప్రయత్నించాడు. కానీ అతని ప్రయత్నం బెడిసి కొట్టింది. కొట్టేసిన పర్సు కిందపడిపోయింది. ఇంకేముంది... పర్సు ఓనర్ చూశాడు. పట్టుకొని ఉతికి ఆరేశాడు. అసలే ఆర్మీమెన్ మరీ.. ఢిల్లీలో మెట్రోలో  ఓ ఆర్మీ మెన్  పర్సు కొట్టేసేందుకు ప్రయత్నించిన జేబు దొంగను పట్టుకొని చితకబాదారు ప్రయాణికులు. అనంతరం పోలీసులు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

మెట్రోలో ప్రయాణిస్తున్న ఓ ఆర్మీ జవాను నుంచి పర్సు దొంగిలించేందుకు ప్రయత్నించగా పర్సు పడిపోవడంతో వెంటనే గుర్తించిన ఆర్మీ జవాను, అతనితోపాటు ప్రయాణికులు నిందితుడిని పట్టుకొని కంపార్టుమెంట్ బయటకు తన్నుకుంటూ తీసుకెళ్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. ఆ తర్వాత నిందితుడిని పోలీసులు అప్పగించారు.