అంతర్జాతీయ క్రికెట్‌కు నెదర్లాండ్స్ కెప్టెన్ పీటర్ సీలార్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ అనంతరం క్రికెట్ నుండి తప్పుకోనున్నట్లుగా తెలిపాడు. 34 ఏళ్ల పీటర్ వెన్నునొప్పి సమస్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. "2020 ఏడాది తర్వాత నా వెన్నునొప్పి మరింత తీవ్రమైంది. కాబట్టి అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించకున్నాను. నాకు ఇన్నాళ్లు మద్దుతుగా నిలిచిన అభిమానులకు,నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డ్‌కు ధన్యవాదాలు" అని పీటర్ తెలిపాడు. 2006లో క్రికెట్ లోకి సీలార్ అరంగేట్రం చేయగా సుమారుగా 18 ఏళ్ల పాటు జట్టుకు సేవలు అందించాడు. 2018 నుంచి నెదర్లాండ్స్ టీమ్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తూ వచ్చాడు. మొత్తం 57 వన్డేలలో సీలార్ 347 పరుగులు చేసి 57 వికెట్లు తీశాడు. ట్వీ20క్రికెట్‌లో 77 మ్యాచ్‌లు ఆడి 58 వికెట్లు తీసి 591 పరుగులు చేశాడు, ఇందులో అజేయంగా 96 పరుగులు చేశాడు.

