అమ్మ వారి ఊరేగింపుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో పిల్

అమ్మ వారి ఊరేగింపుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో పిల్

అమ్మ వారి ఊరేగింపుకు అనుమతి ఇవ్వాలని అక్కన్న, మాదన్న ఆలయ నిర్వాహకులు హైకోర్టు లో పిల్ ధాఖలు చేశారు. పాతబస్తీలోని అక్కన్న మాదన్న ఆలయం చారిత్రాత్మక కట్టడం వారు పిల్ లో పేర్కొన్నారు. కరోనా సాకుతో ఎవరినీ సంప్రదించకుండా బోనాల పండుగను ప్రభుత్వం నిలిపివేసింది వారు ఆరోపించారు. దశాబ్దాల కాలం నుండి వస్తున్న ఆమ్మవారి ఊరేగింపుకు అనుమతి ఇవ్వాలని పిటీషనర్ హైకోర్టును కోరారు. అదేవిధంగా సంప్రదాయాలకు విఘాతం కలగకుండా చూడాలని హైకోర్టును కోరారు. ఊరేగింపునకు అనుమతిస్తే.. ప్రజలను కరోనా నుండి రక్షించాలని అమ్మవారిని ప్రార్ధిస్తూ బోనాల పండుగ జరుపుతామని పిటీషనర్ పేర్కొన్నారు. ఈ పిల్ ను స్వీకరించిన హైకోర్టు.. సోమవారం విచారించునున్నట్లు తెలిపింది.

For More News..

దేశంలోనే మొదటిసారి.. తల్లికి కరోనా నెగిటివ్.. అప్పుడే పుట్టిన బిడ్డకు పాజిటివ్

మార్కెట్లోకి డైమండ్ మాస్కులు.. ఆర్డరిచ్చి మరీ చేయించుకుంటున్న కొత్త జంటలు

38 ఏళ్ల కింద మర్డర్.. ఇప్పుడు అరెస్ట్