జాతీయ విద్యా విధానంపై హైకోర్టులో పిల్

జాతీయ విద్యా విధానంపై హైకోర్టులో పిల్
  •  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: దేశంలో పిల్లలు ఒకటో తరగతిలో చేరాలంటే వాళ్ల వయసు ఆరు సంవత్సరాలు ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జాతీయ విద్యా విధానాన్ని సవాల్‌‌  చేస్తూ హైకోర్టులో పిల్‌‌ దాఖలైంది. చీఫ్‌‌ జస్టిస్‌‌  అలోక్‌‌  అరాధే, జస్టిస్‌‌  అనిల్‌‌ కుమార్ తో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ శుక్రవారం ఈ పిల్ పై విచారణ జరిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.

అడ్వొకేట్  పరీక్షిత్‌‌ రెడ్డి వ్యక్తిగత హోదాలో దాఖలు చేసిన పిల్‌‌పై తదుపరి విచారణను వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వం నిరుడు ఫిబ్రవరి 9న రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో ఒకటో తరగతిలో చేరే స్టూడెంట్‌‌ వయసు ఆరేండ్లు ఉండాలని పేర్కొంది. జాతీయ విద్యా విధానంలో భాగంగా రాసిన ఆ లేఖలోని అంశాలన్నీ రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించాలని పిటిషనర్‌‌  తన పిల్ లో కోరారు.