బీఆర్‌‌‌‌ఎస్‌‌ నుంచి పిల్లి రామరాజు సస్పెన్షన్

బీఆర్‌‌‌‌ఎస్‌‌ నుంచి పిల్లి రామరాజు సస్పెన్షన్

నల్గొండ అర్బన్, వెలుగు:  నల్గొండ పట్టణంలోని 8వ వార్డు కౌన్సిలర్, బీఆర్‌‌‌‌ఎస్‌‌ సీనియర్ నేత పిల్లి రామరాజును సస్పెండ్ చేస్తున్నట్లుజడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చాడ కిషన్ రెడ్డి, నిరంజన్ వలి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.  పార్టీ ప్రకటించిన అభ్యర్థికి వ్యతిరేకంగా మీటింగ్‌‌లు పెట్టి ప్రచారం చేస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక నుంచి రామరాజు నిర్వహించే సమావేశాలు, ఇతర కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనొద్దని, లేదంటే వారిని కూడా పార్టీ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. 

కక్ష సాధింపు చర్యే

బీసీ నేతగా తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను ఓర్వలేకనే  ఎమ్మెల్యే భూపాల్‌‌రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని పిల్లి రామరాజు ఆరోపించారు. తనను సస్పెండ్ చేసే అధికారం జడ్పీ చైర్మన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులకు లేదన్నారు. త్వరలోనే భవిష్యత్‌‌ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు.