దేశంలో ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పైన్ ల్యాబ్స్ ఐపీవో మార్కెట్లో అద్భుతమైన లిస్టింగ్ చూసింది. కంపెనీ షేర్లు వాస్తవ ఇష్యూ ధర కంటే 9.5 శాతం ప్రీమియం ధర రూ.242 వద్ద బీఎస్ఈలో జాబితా అయ్యింది. ఈ క్రమంలో గ్రేమార్కెట్ అంచనాలను సైతం బీట్ చేసి లాభాలు కురిపించటంపై పెట్టుబడిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నవంబర్ 7 నుంచి 11 వరకు పెట్టుబడిదారుల సబ్ స్క్రిప్షన్ కోసం ఐపీవో అందుబాటులో ఉంచబడింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.3వేల 900 మూలధనాన్ని సమీకరించింది విజయవంతంగా. ఇందులో రూ.2వేల 80 కోట్లకు తాజా ఈక్విటీ ఇష్యూ ఉండగా.. మిగిలినది ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయించబడింది. ఇందులో ప్రధాన ఇన్వెస్టర్లు అయిన మాస్టర్ కార్డ్, పేపాల్, మ్యాడిసన్ ఇండియా వంటి సంస్థలు తమ పెట్టుబడులను ఆఫ్ లోడ్ చేసుకున్నాయి.
కంపెనీ ఐపీవో ఇష్యూ కోసం ప్రైస్ బ్యాండ్ ధరను షేరుకు రూ.210 నుంచి 221 మధ్య నిర్ణయించింది. అలాగే లాట్ పరిమాణం 67 షేర్లు కావటంతో ఇన్వెస్టర్లు రూ.14వేల 807 పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది. ఉద్యోగులకు కేటాయించిన భాగం కూడా మంచి స్పందనను చూపించిందని వెల్లడైంది. దీని తర్వాత క్వాలిఫైడ్ ఇన్వెస్టర్లు కూడా ఐపీవోపై ఎక్కువగా ఆసక్తిని చూపించారు.
కంపెనీ ఐపీవో నుంచి వచ్చిన నిధులను ముఖ్యంగా రుణాలను చెల్లించడంకోసం, ఐటి ఆస్తులు, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్‌ట్రక్చర్, టెక్నాలజీ అభివృద్ధి, డిజిటల్ చెక్అవుట్ పాయింట్ల కొనుగోలు కోసం ఉపయోగించాలని ప్లాన్ చేసింది. అలాగే వ్యాపారాన్ని అంతర్జాతీయ విస్తరణకూ వాడాలని భావిస్తోంది.
కంపెనీ వ్యాపారం..
పైన్ ల్యాబ్స్ 1998లో ప్రారంభమైన ఫిన్టెక్ రంగంలో కార్యకలాపాలు నిర్వహించే సంస్థ. ఇది రైతు వాణిజ్య, రిటైల్, పాయింట్ ఆఫ్ సేల్ సొల్యూషన్స్ అందించడం ప్రారంభించింది. డిజిటల్ పేమెంట్ల విస్తరణతో పాటుగా సంస్థ అభివృద్ధి చెందుతూ.. డిజిటల్ చెల్లింపు, EMI ఆప్షన్స్, లాయల్టీ ప్రోగ్రామ్‌లు వంటి సేవల ద్వారా ఇండియా, మధ్యప్రాచ్యం, ఆసియాపసిఫిక్ ప్రాంతాల్లో 9.8 లక్షల వ్యాపార భాగస్వాములకు సేవలందిస్తోంది. ఈ కంపెనీ టెక్నాలజీ, క్లౌడ్ ఆధారిత వ్యాపార మోడల్‌తో పేమెంట్ల వినియోగాన్ని సులభతరం చేస్తోంది. 177 ఆర్థిక సంస్థలతో నెట్‌వర్క్ కలిగి ఉంది.
