
హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరలోనే ఎలక్ట్రానిక్స్ తయారీకి పవర్ హౌస్‌గా మారుతుందని సెల్కాన్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై.గురు అన్నారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రితో జరిగే సమావేశంలో వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించనున్నారని వెల్లడించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్‌కి వై.గురు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్ట్రానిక్స్ తయారీలో ప్రముఖ హబ్‌గా మార్చేందుకు తాను పూర్తిగా సమాయత్తమయ్యానని, పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఐటీ మంత్రి ఈ సమావేశంలో తెలియజేసినట్లు ఆయన పేర్కొన్నారు. 2019లో దేశంలో 75 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం, 2024 నాటికి 115 బిలియన్ డాలర్లకు చేరుకోనుందని చెప్పారు. ప్రస్తుతం భారతదేశం రూ.1,20,000 కోట్ల విలువైన మొబైల్ ఫోన్‌లను ఎగుమతి చేస్తోందని చెప్పారు. తిరుపతి ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లో తమ ప్లాంటు ఉందన్నారు.