
పాట్నా: బిహార్ ఎన్నికల్లో గెలిస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ హామీ పచ్చి అబద్ధమని జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ అన్నారు. బిహార్ లో 26 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని.. ఆయన హామీ ఇచ్చిన 3 కోట్ల ఉద్యోగాలు అసాధ్యమన్నారు. ఈ మేరకు గురువారం మీడియాతో ప్రశాంత్ కిశోర్ మాట్లాడారు.
“గతంలో ప్రధాని మోదీ దేశమంతా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అది ఇప్పటికీ నెరవేరలేదు. ఇప్పుడు తేజస్వీ యాదవ్ బిహార్ లో 3 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెబుతున్నారు. ఇది అసాధ్యం. ప్రజలు తెలివైనవారు. ఇటువంటి వాటిని సులభంగా అర్థం చేసుకుంటారు’’ అని పేర్కొన్నారు.