అయ్యయ్యో.. విమానం ఇరుక్కుపోయింది

అయ్యయ్యో.. విమానం ఇరుక్కుపోయింది

ఆకాశంలో రయ్యున దూసుకుపోవాల్సిన గాలిమోటరు బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది. ముందుకుపోలేక, వెనక్కు రాలేక అక్కడే ఆగిపోయింది. చైనాలోని హర్బిన్​లో జరిగిందీ ఘటన. విమానం బాడీని ఓ పెద్ద ట్రక్కుపై తీసుకెళుతుండగా ఇలా ఫుట్​ బ్రిడ్జి కింద ఇరుక్కుందన్నమాట. దానిని బయటకు తీయడానికి డ్రైవర్​ నానా తంటాలు పడ్డాడు. ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు. అయినా, అది కదల్లేదు. వేరే దారి లేక ట్రక్కు టైర్లలోని గాలిని తీసేసి ముందుకు పోనిచ్చాడు డ్రైవర్​. తర్వాత మళ్లీ టైర్లలో గాలి పెట్టి ఆ విమానాన్ని తీసుకుపోయాడు. చైనా వార్తా సంస్థ ఆ వీడియోను ట్విట్టర్​లో పెట్టడంతో నెటిజన్లు నవ్వులు పండించారు.

Plane gets stuck under bridge in China.