
హైదరాబాద్, వెలుగు: స్వచ్ఛమైన ప్లాటినమ్‌తో తయారు చేసిన ప్లాటినం ఎవారా ఆభరణాలను మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చామని పీజీఐ ప్రకటించింది. ఈ కలెక్షన్ 95శాతం స్వచ్ఛమైన ప్లాటినంతో తయారయిందని తెలిపింది. ఈ కలెక్షన్లో పెండెంట్‌లు, బ్రాస్‌లెట్ల వంటివి ఉంటాయి. వర్షాకాలంలో ధరించడానికి ఇవి అనువుగా ఉంటాయని తెలిపింది. ప్రముఖ జ్యువెలరీ రిటైల్ స్టోర్లలో ఇవి అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ధరలు రూ.14 వేల నుంచి మొదలవుతాయి.