నా స్టంట్స్‌‌ మారిస్తే నన్ను అవమానించినట్లే

నా స్టంట్స్‌‌ మారిస్తే నన్ను అవమానించినట్లే
బెంగళూరు: పాన్ ఇండియా హిట్ మూవీ కేజీఎఫ్ సీక్వెల్‌ చాప్టర్‌‌-2‌లో బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ నటిస్తున్నాడు. అధీరాగా తన సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నాడు. తన పాత్రకు సంబంధించిన చాలా సీన్లలో సంజూ నటించేశాడు. అయితే మేజర్ యాక్షన్ సీన్స్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. క్యాన్సర్ కారణంగా షూటింగ్‌‌కు కొంతకాలం దూరమైన సంజూ బాబా.. ట్రీట్‌‌మెంట్ అనంతరం తిరిగి బెంగళూరుకు చేరుకున్నాడు. ఈ మూవీ క్లైమాక్స్ చిత్రీకరణ జరగాల్సి ఉంది. అయితే సంజూ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన స్టంట్స్‌‌ను సింపుల్‌‌గా ఉండేలా మారుస్తామని డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యశ్ సూచించారట. దీనికి సంజూ ఒప్పుకోలేదట. యాక్షన్స్ సీన్స్ చేయలేనని చెప్పి తనను అవమానించొద్దని సంజూ చెప్పాడట. ఏ విధంగా అయితే యాక్షన్ స్టంట్స్‌‌ను ప్లాన్ చేశారో అలాగే నటిస్తానని, కాంప్రమైజ్ అయ్యే చాన్స్ లేదని.. చీటింగ్ చేయాలనుకోవట్లేదని సంజూ చెప్పినట్లు చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరి సంజూ రిస్క్ తీసుకొని చేస్తున్న ఈ షాట్స్ సినిమాలో ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి.