బరువు తగ్గించండి ప్లీజ్!

V6 Velugu Posted on Aug 04, 2021

మరికల్, వెలుగు: ఈ ఫొటోలో కనిపిస్తున బాలుడి పేరు ఎండీ అబ్రార్. నారాయణపేట జిల్లా మరికల్​కి చెందిన ఎండీ జావిద్​ చిన్నకొడుకు. వయస్సు ఆరేళ్లు. పుట్టినప్పుడు 3 కిలోల బరువు ఉండగా ప్రస్తుతం 38 కిలోలు ఉన్నాడు. గతంలో న్యుమోనియా వచ్చి తగ్గాక అనూహ్యంగా బరువు పెరిగి ఇలా అయ్యాడు. అతని బరువు తగ్గించేందుకు తల్లిదండ్రులు ఇప్పటి వరకు హైదరాబాద్​ సహా ఎన్నో పెద్ద హాస్పిటల్స్​తిరిగారు. రూ.5లక్షల వరకు ఖర్చు చేశారు. అయినా కొంచెం కూడా తగ్గించలేకపోయారు. వృత్తిరీత్యా డ్రైవర్​అయిన జావిద్.. మొదటి కొడుకు అమేర్​ మూత్రనాళ సమస్యతో బాధపడుతుండగా.. రెండో కొడుకు అబ్రార్ ​బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నాడని వాపోతున్నాడు. టెక్నాలజీని ఉపయోగించి తన కొడుకు బరువు తగ్గించేందుకు సాయపడాలని డాక్టర్లను వేడుకుంటున్నాడు. 

Tagged BOY, weight, , problem

Latest Videos

Subscribe Now

More News