పీఎం కేర్స్ ప్రభుత్వ నిధి కాదు.. కానీ నిజాయితీగా ఉంటది

పీఎం కేర్స్ ప్రభుత్వ నిధి కాదు.. కానీ నిజాయితీగా ఉంటది

న్యూఢిల్లీ: విపత్తుల సమయంలో ప్రజలకు సాయం అందించేందుకు ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్‌‌పై ప్రతిపక్షాలు విమర్శలకు దిగుతున్నాయి. ముఖ్యంగా కరోనా ఫస్ట్ వేవ్ విజ‌ృంభిస్తున్న సమయంలో సెలబ్రిటీలతోపాటు అనేక మంది ఈ ఫండ్‌కు విరాళాలను అందించారు. అయితే ఈ డొనేషన్స్‌ను ప్రజలకు అందించారా అంటూ విపక్షాలు ప్రశ్నించాయి. ప్రతిపక్షాల విషయాన్ని పక్కనబెడితే.. సాధారణ ప్రజల్లో కూడా ఈ ఫండ్ పనితీరు, నిర్వహణపై పలు ప్రశ్నలు, అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పీఎం కేర్స్ ఫండ్ నిర్వహణ మీద ఢిల్లీ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఓ అఫిడవిట్‌ను సమర్పించింది. పీఎం కేర్స్ భారత ప్రభుత్వ నిధి కాదని ఆ అఫిడవిట్‌లో కేంద్రం స్పష్టం చేసింది. పీఎం కేర్స్ ఫండ్‌పై దాఖలైన పిటిషన్‌కు సమాధానంగా ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) సెక్రటరీ ప్రదీప్ కుమార్ శ్రీవాత్సవ ఈ అఫిడవిట్‌ను ఫైల్ చేశారు. 

పీఎం కేర్స్ ఫండ్ ద్వారా సేకరించిన విరాళాలు భారత ప్రభుత్వ నిధిలో జమకావని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. అయితే పీఎం కేర్స్ కార్యకలాపాలు మాత్రం పారదర్శకంగా జరుగుతాయని పేర్కొంది. ‘దాతల నుంచి ఆన్‌లైన్ పేమెంట్స్, చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్స్ ద్వారా డొనేషన్స్‌ తీసుకున్నాం. వీటిని ఆడిటింగ్ కూడా చేయిస్తాం. ఆడిట్ రిపోర్టులతోపాటు ఫండ్‌లో ఉన్న నిధులు,  జమాఖర్చులు తదితర వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చాం. ప్రజల ఆసక్తుల దృష్ట్యా మరే ఛారిటీ సంస్థతోనూ పోల్చలేని విధంగా నిజాయితీ, పారదర్శకతలే ప్రాతిపదికలుగా ఈ నిధిని వినియోగిస్తున్నాం. ఈ ఫండ్‌కు సంబంధించిన అన్ని తీర్మానాలను వెబ్‌సైట్‌లో పెట్టేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని అఫిడవిట్‌లో కేంద్రం వివరించింది. 

మరిన్ని వార్తల కోసం: 

రకుల్, రానాలను కేటీఆర్ తప్పించారు

‘మా’ ఎలక్షన్స్: ప్యానెల్‌ ప్రకటించిన మంచు విష్ణు

వైరల్ వీడియో: చదువుకుంటూ పేపర్ వేయొద్దా?

సీఎం గారూ.. నలుగురికి చార్టెడ్ ఫ్లయిట్ అవసరమా?