
దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. పీఎం కిసాన్ (PM kisan) ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టింది. అయితే.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నగదు (ఏడాదికి మూడు దఫాల్లో రూ. 2 వేలు.. మొత్తం రూ. 6వేలు) జమ కావాలంటే.. రైతులు eKYC పూర్తి చేసుకోవడం తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనికి గడువు కూడా విధించింది. ఈప్రక్రియ పూర్తికి జూలై 31 వరకు గడువు ఉంది. అయితే... చాలా మంది రైతులు eKYC పూర్తి చేయకపోవడంతో గడువు పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 31 వరకు గడువు పొడిగించారు. ఇప్పటికే 11 విడతల్లో రూ. 2 వేలు చొప్పున కేంద్రం విడుదల చేసింది. 12వ విడుత సెప్టెంబర్ లో విడుదల చేసే అవకాశం ఉంది.
పీఎం- కిసాన్ eKYC పూర్తి చేయడం ఇలా...
- పీఎం - కిసాన్ అధికారిక వెబ్ సైట్ (https.//pmkisan.gov.in/)ను సందర్శించాలి.
- కుడి వైపున అందుబాటులో ఉన్న eKYCపై క్లిక్ చేయండి.
- ఆధార్ కార్డు నెంబర్ ను ఎంటర్ చేయాలి. అనంతరం Capcha కోడ్ ను నమోదు చేసి సెర్చ్ పై క్లిక్ చేయండి.
- ఆధార్ కార్డుతో లింక్ చేసిన మొబైల్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
- Get OTPపై క్లిక్ చేయండి. వచ్చిన OTPని నమోదు చేయాలి.
- అన్ని వివరాలు సరైనవి అయితే.. eKYC ప్రక్రియ పూర్తవుతుంది. ఒకవేళ ఏదైనా సమస్యలు వస్తే.. స్థానికంగా ఉన్న ఆధార్ సేవా కేంద్రాన్ని సంప్రదించాలి.