Good news : జూన్ 18న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు

Good news : జూన్ 18న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు
  • రూ.20 వేల కోట్లు జమచేయనున్న మోదీ: కేంద్ర మంత్రి శివరాజ్

న్యూఢిల్లీ, వెలుగు: పీఎం కిసాన్ యోజన 17వ విడత నిధులను మంగళవారం రైతుల ఖాతాల్లో జమచేయనున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దీంతో 9.26 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరందని వివరించారు. ఈనెల 18న ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని రూ.20 వేల కోట్లను రైతుల ఖాతాల్లోకి రిలీజ్ చేస్తారని చౌహాన్ వెల్లడించారు. 

ఈ కార్యక్రమానికి సంబంధించి శనివారం ఢిల్లీలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం కేంద్రం అనేక చర్యలు తీసుకుంటున్నదన్నారు. మోదీ.. తన తొలి సంతకం 17 విడత కిసాన్ సమ్మాన్ నిధి డబ్బుల విడుదల ఫైల్​పైనే చేశారని తెలిపారు.