
పాట్నా: కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలపై ప్రధాని మోడీ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, ఆర్జేడీ కుటుంబ పార్టీలని.. వాళ్లకు ప్రజలు గురించి అవసరం లేదని విమర్శించారు. కానీ బీజేపీ అలా కాదని మాది సబ్ కా సాథ్ సబ్ కా విశ్వాస్ విధానమని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైనా పేదల సంక్షేమం కోసం కృషి చేస్తోందని అన్నారు.
ఇందులో భాగంగానే జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణలు 2025, సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయని గుర్తు చేసిన మోడీ.. దీని ద్వారా నిత్యవసర సరుకుల ధరలు తగ్గి సామాన్యలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. టూత్‌పేస్ట్, సబ్బు, షాంపూ, ఆహార పదర్ధాలు.. ఇలా నిత్యవసర సరుకుల ధరలు చౌకగా మారుతాయని తెలిపారు.
సోమవారం (సెప్టెంబర్ 15) ప్రధాని మోడీ బీహార్‌లో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేశారు. అనంతరం పూర్ణియాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలపై నిప్పులు చెరిగారు. బీజేపీ ప్రభుత్వం దేశంలోని చొరబాటుదారులను తరమికొడుతుందని హెచ్చరించారు. ఆర్జేడీ-కాంగ్రెస్ పాలనలో బీహార్ చాలా నష్టపోయిందని అన్నారు.
►ALSO READ | ఢిల్లీలో BMW బీభత్సం.. కేంద్ర ఆర్థిక శాఖ అధికారి స్పాట్ డెడ్.. పెద్ద ట్విస్ట్ ఏంటంటే..
ఎన్డీఏ సర్కార్ బీహార్‌ను అభివృద్ధిని చేస్తుంటే కాంగ్రెస్, ఆర్జేడీ జీర్ణించుకోలేకపోతున్నాయని.. అందుకే ఓట్ చోరీ అంటూ అనవసరమైన అంశాలను లేవనెత్తుతున్నాయని ఫైర్ అయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఈ రెండు పార్టీలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, ఆర్జేడీ బీహార్ గౌరవాన్ని మాత్రమే కాకుండా రాష్ట్ర గుర్తింపును కూడా బెదిరించాయని మండిపడ్డారు.