
ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అమరావతి చేరుకున్నారు. శుక్రవారం (మే2) ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్ కు చేరుకున్నారు. ప్రధానిమోదీకి అక్కడినుంచి ఆయన నేరుగా అమరావతిలోని సచివాలయానికి వెళ్లనున్నారు. అనంతర సచివాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.ప్రధాని పర్యటనలో భాగంగా ఏపీ ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలు చేసుకోనుంది. IBM, TCS, L&T లతో కూడిన టెక్ పార్క్ కోసం MOU చేసుకోనున్నారు.
అమరావతిలో 57వేల కోట్లతో మొత్తం 94 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. అమరావతికి కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అధికారికంగా ప్రారంభించనున్నారు.
రూ.5,028 కోట్ల విలువైన 9 కేంద్ర ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. DRDO క్షిపణి పరీక్ష కేంద్రం,యూనిటీ మాల్, గుంతకల్-నుంచి మల్లప్ప గేట్ రైల్ ఓవర్ బ్రిడ్జి,6 జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ.