బుందేల్ఖండ్ ఎక్స్ ప్రెస్ వేను ప్రారంభించిన ప్రధాని మోడీ

 బుందేల్ఖండ్ ఎక్స్ ప్రెస్ వేను ప్రారంభించిన ప్రధాని మోడీ

అభివృద్ధిని కేవలం నగరాలకే కాకుండా గ్రామాలకు కూడా విస్తరిస్తున్నామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. యూపీలో బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వేను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. కనెక్టివిటీ, పారిశ్రామిక అభివృద్ధికి ఎక్స్ ప్రెస్ వేలు దోహదపడుతాయన్నారు. శాంతిభద్రతలు, కనెక్టివిటీ బాగుంటేనే రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందగలదన్నారు. అనుకున్న టైమ్ కంటే ముందే బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ హైవేను ప్రారంభించామని తెలిపారు.. దేశం మొత్తం ఇప్పుడు యూపీవైపు చూస్తోందన్నారు ప్రధాని మోడీ.

రాష్ట్రంలో టూరిజం మరింత అభివృద్ధి కానుందన్నారు. యూపీలోని ప్రతి మూలకు డబుల్ ఇంజిన్ సర్కార్  అభివృద్ధి ఫలాలను మోసుకెళ్తుందన్నారు. గత ఎనిమిదేండ్లుగా చిన్న పట్టణాలను నగరాలతో అనుసంధానం చేసే పని చేస్తున్నామన్నారు. బంధా, జలౌన్ జిల్లాల్లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుపనులు ప్రారంభమయ్యాయన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.  

దాదాపు 14 వేల 850 కోట్ల వ్యయంతో 296 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల ఎక్స్ ప్రెస్ వేను నిర్మించారు. ఈ ప్రాజెక్టు 2020 ఫిబ్రవరి 29న మోడీ శంకుస్థాపన చేయగా.. ఎక్స్ ప్రెస్ వేను ఇండియన్ డెవలప్ మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో 28 నెలల్లోనే ప్రాజెక్టును నిర్మించారు.