దేశ భద్రతపై కేబినెట్ కమిటీ రివ్యూ.. ప్రధాని కీలక ఆదేశాలు

దేశ భద్రతపై కేబినెట్ కమిటీ రివ్యూ.. ప్రధాని కీలక ఆదేశాలు

దేశ భద్రత, సన్నద్దతపై కేబినెట్ కమిటీతో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం మధ్యాహ్నం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో భారత్ వ్యవహరించాల్సిన విధానంపైనా చర్చించారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. ఉక్రెయిన్ లో పరిస్థితులను, ఆపరేషన్ గంగా వివరాలను ప్రధానికి ఉన్నతాధికారులు వివరించారు. ఉక్రెయిన్ లోని ఖర్కివ్ లో జరిగిన దాడుల్లో మరణించిన కర్ణాటకకు చెందిన వైద్య విద్యార్థి నవీన్ భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ ఆదేశించారు.

అలాగే దేశ సరిహద్దులో భద్రత, సైన్యం సన్నద్ధతపైనా ప్రధాని మోడీకి  త్రివిధ దళాధిపతులు వివరించారు. రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించేలా చర్యలు తీసుకోవాలని  ప్రధాని సూచించారు. దీని ద్వారా మన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడంతో పాటు ఆర్థికంగానూ దేశం వృద్ధి చెందుతుందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలను మన రక్షణ రంగంలో వాడుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు.

మరిన్ని వార్తల కోసం..

నోటిఫికేషన్స్ కోసం చెవిలో పువ్వు, నోటిలో వేలితో మౌనదీక్ష

ఉక్రెయిన్లో మరో మేయర్ కిడ్నాప్

సింగరేణి ప్రైవేటీకరణపై ఎక్కడైనా చర్చకు రెడీ