ఉక్రెయిన్లో మరో మేయర్ కిడ్నాప్

 ఉక్రెయిన్లో మరో మేయర్ కిడ్నాప్

ఉక్రెయిన్ దేశంపై ముప్పేట దాడులతో విరుచుకుపడుతూ విధ్వంసం సృష్టిస్తున్న రష్యా దళాలు ఇవాళ మరో మేయర్ ని కిడ్నాప్ చేశాయి. ఉక్రెయిన్ సైన్యం లొంగిపోతుంది.. స్థానికులు స్వాగతిస్తారనుకుంటే.. ఇందుకు భిన్నమైన పరిస్థితి ఎదురవుతుండడంతో రష్యా దళాలు అసహనంతో ఊగిపోతున్నట్లు పలు ఘటనలు రుజువు చేస్తున్నాయి. రెండ్రోజుల కిందట మెలిటోపోల్ మేయర్ ను కిడ్నాప్ చేసిన రష్యన్ దళాలు.. ఇవాళ ద్నిప్రోరుడ్నే మేయర్ యెవ్ హన్ మాత్వేయెవ్ ను కిడ్నాప్ చేశాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా స్వయంగా వెల్లడించారు. ఉక్రెయిన్ పౌరులు లొంగిపోతారని ఆశిస్తుంటే  తిరగబడుతుండడంపై అసహనంతో ఉన్న రష్యా దళాలు హింసకు దిగుతూ మరో మేయర్ ను కిడ్నాప్ చేశాయని ఆయన ట్విట్ చేశారు. ఉక్రెయిన్ లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు, రష్యా దాడులను నిలువరించేందుకు అంతర్జాతీయ సంస్థలు కృషి చేయాలని ట్విట్టర్ వేదికగా ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి మరోసారి పిలుపునిచ్చారు. 

 

ఇవి కూడా చదవండి

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

పోషకాహారం అందించే ఏజెన్సీలపై సర్కార్ కీలక నిర్ణయం

కొడుకు ఎమ్మెల్యేగా గెలిచినా స్వీపర్ ఉద్యోగం వదలను