కరోనా పై థాయ్ ప్రధాని తో మాట్లాడిన మోడీ

కరోనా పై థాయ్ ప్రధాని తో మాట్లాడిన  మోడీ

న్యూ ఢిల్లీ : కరోనా ఎఫెక్ట్ ప్రారంభమైన నాటి నుంచి దీని నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ప్రధాని మోడీ దేశంలో పలువురు నేతలతో మాట్లాడుతున్నారు. ఇదే కాకుండా ప్రపంచ లోని పలు దేశాల్లోనూ కరోనా ఎఫెక్ట్ ఎలా ఉంది ఆయా దేశాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రధాని మోడీ చెబుతున్నారు. ఇదే క్రమంలో పలు దేశాల అధినేతలతో ఆయన ఫోన్ లో మాట్లాడుతున్నారు. తాజాగా థాయ్ లాండ్ ప్రధాని ప్రయుత్ చాన్ తో మోడీ మాట్లాడారు. ఆయనతో జరిగిన సంభాషణను తెలుపుతూ మోడీ ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారికి సంబంధించి పలు అంశాలను మిత్రుడు ప్రయుత్ తో చర్చించాను. చారిత్రకంగా, సాంస్కృతికంగా భారత్ కు థాయ్ లాండ్ తో సుదీర్ఘ అనుబంధం ఉంది. ప్రస్తుత సంక్షోభాన్ని కరోనా వైరస్ కారణంగా ఎదురవుతున్న అనేక సమస్యలను కలిసికట్టుగా ఎదుర్కొంటాం అని ప్రధాని ట్వీట్ చేశారు. కరోనా నివారణకు అమవుతున్న చర్యలను ఇరుదేశాల నేతలు ఒకరినొకరు అడిగి తెలుసుకున్నారు.