
ఢిల్లీ: రాజ్యసభలో తీవ్ర ఉధ్వేగానికి లోనయ్యారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. విపక్ష నేత గులాం నబీ ఆజాద్ రిటైర్మెంట్ సందర్భంగా మాట్లాడిన మోడీ.. సభలో కన్నీరు పెట్టుకున్నారు. ఫిబ్రవరి 15తో ఆజాద్ రాజ్యసభ పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టుకున్నారు. ‘‘ఉన్నత పదవులు వస్తుంటాయి. అధికారమూ వస్తుంది. ఇన్ని వచ్చినా, ఎలా వుండాలో ఆజాద్ దగ్గర నేర్చుకోవాలి. ఆజాద్ నాకు నిజమైన స్నేహితుడు.’’ అంటూ మోదీ ఉద్వేగానికి గురయ్యారు. కశ్మీర్ టూర్ వెళ్లిన గుజరాత్ వాసులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన సమయంలో ఆయన వ్యవహరించిన తీరును గుర్తు చేసుకుని.. కన్నీరు పెట్టారు. సభలో గులాంనబీ ఆజాద్ కు సెల్యూట్ చేశారు. తన పార్టీతో పాటు.. దేశానికి సభకు ఆజాద్ చాలా గౌరవమిస్తారని చెప్పారు మోడీ.