
గాజా శాంతి శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీకి ఆహ్వనం అందింది. ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేక్ లో జరగనున్న గాజా శాంతి సదస్సుకు హాజరు కావాలని ఈజీప్టు అధ్యక్షుడు అడ్టేల్ ఫత్తా ఎల్ సిసి అధికారిక ఆహ్వానం పంపారు. అయితే ఈ సమావేశానికి స్వయంగా మోదీ హాజరయ్యే కనిపించడం లేదు. భారత్ తరపున ఆయనకు బదులుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి కీర్తీ వర్దన్ సింగ్ ను ఈ సమావేశానికి హాజరు కానున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈజిప్టు అధ్యక్షుడు ఎల్ సీసీ సంయుక్తంగా అధ్యక్షత వహించే ఈ సమావేశానికి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెర్రెస్, యూకె ప్రధాని కీర్ స్టార్మర్, ఇటాలియన్ ప్రధాని జార్జియా మెలోనీ, స్పానిష్ ప్రధాని పెడ్రో సాంచెజ్, ఫ్రెంచ్అధ్యక్షుడు ఇమ్మానియేల్ మాక్రాన్సహా 20 దేశాల నాయకులు హాజరుకానున్నారు.
ఈజిప్లులో గాజా శాంతి సమావేశం..
గాజాలో యుద్దాన్ని ముగింపుకు ఒప్పందాన్ని చేసేందుకు ఈజిప్టు సోమవారం ( అక్టోబర్ 13) ఎర్ర సముద్రంలోని రిసార్ట్ నగరమైన షర్మ్ ఎల్ షేర్ లో అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఈజిప్టు అధ్యక్షుడు తెలిపారు.
అయితే ఈ సమావేశంలో యుద్ధాన్ని అధికారికంగా ఎలా ముగించగలదో అస్పష్ట ఉండటంతో హమాస్ ఇకపై గాజా పాలనలో ఎటువంటి ముప్పును కలిగించదని, దాని నుండి ఎటువంటి ప్రమాదం లేదని సంతృప్తి చెందే వరకు యుద్ధాన్ని ముగించడానికి అంగీకరించబోమని ఇజ్రాయెల్ తెలిపింది.
హమాస్ హాజరవుతుందా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన ప్రణాళికతో కొన్ని విభేదాల కారణంగా ఈజిప్టులో గాజా శాంతి ఒప్పందంపై అధికారిక సంతకం కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ప్రకటించింది.