హ్యాపీ బర్త్ డే మిత్రమా..! పుతిన్‎కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోడీ

హ్యాపీ బర్త్ డే మిత్రమా..! పుతిన్‎కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు పుతిన్‎కు ప్రధాని మోడీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పుతిన్ 73వ బర్త్ డే సందర్భంగా మంగళవారం (అక్టోబర్ 7) ప్రధాని మోడీ ఆయనకు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా పుతిన్‎కు బర్త్ డే విషెస్ చెప్పారు. పుతిన్ ఆయురారోగ్యాలతో ఉండాలని..  భవిష్యత్ ప్రయత్నాలన్నింటిలోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. 

ఇండియా-రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలంగా ముందుకు తీసుకెళ్తామని ఇరువురూ పునరుద్ఘాటించారు. ఇండియా--రష్యా స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్‎లో భాగంగా ఇరుదేశాల మధ్య ఇంధనం, రక్షణ, వాణిజ్యం, అంతరిక్ష సహకారం వంటి అంశాలపై చర్చించారు. పుతిన్ భారత పర్యటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు.

 కాగా, 2025 చివర్లో 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం జరగనుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఈ సమావేశంలో పాల్గొనేందుకు స్వయంగా ఇండియా రానున్నాడు. ఈ సమావేశం రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక భాగస్వామ్యంలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలువనుంది.