మణిపూర్లో త్వరలో శాంతి నెలకొంటుంది : మోదీ

మణిపూర్లో త్వరలో శాంతి నెలకొంటుంది : మోదీ

దేశవ్యాప్తంగా 77వ స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై మోదీ జాతీయ జెండాను అవిష్కరించారు.  ఎర్రకోటపై మోదీ జాతీయ జెండాను అవిష్కరించడం ఇది పదోసారి కావడం విశేషం.   అనంతరం దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.  అంతకుముందు మోదీ రాజ్ ఘట్ వద్ద మహాత్మునికి నివాళులు అర్పించారు.   ఈ   కార్యక్రమంలో కేంద్రమంత్రులు పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా దేశ ప్రజలకు 77వ స్వాంతంత్ర్య దినోత్సవ  శుభాకాంక్షలు తెలిపారు మోదీ. ఎంతోమంది త్యాగాల ఫలితమే ఈ స్వాంతంత్ర్యమని అన్నారు.  తప్పిదాల కారణంగా వేలాది సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నామని చెప్పారు.  యువత, మహిళలు, రైతులు దేశం కోసం పోరాడన్నారు.  మనది దేశంలోనే అతిపెద్ద ప్రజాసౌమ్యమని  చెప్పారు.   ఎంతో సంకల్పంతో దేశ అభివృద్దిని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.  

మణిపూర్ హింసతో చాలా మంది ప్రాణాలు కోల్పాయరని  మోదీ అన్నారు. త్వరలోనే అక్కడ త్వరలోనే శాంతి నెలకొంటుదని తెలిపారు.  శాంతితోనే హింసకు సమాధానం దోరుకుతుందని చెప్పారు.  దేశం  మణిపూర్ ప్రజలకు అండగా ఉందని తెలిపారు.  మణిపూర్ లో శాంతి స్థాపనకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.  

కరోనాసంక్షోభం తరువాత ప్రపంచానికి భారత్ పై సరికొత్త విశ్వాసం నెలకొందని మోదీ చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానానికి చేరుకున్నామని తెలిపారు. 10 ఏళ్ల క్రితం రాష్ట్రాలకు రూ. 30 వేల కోట్లు ఇస్తే..  ఇప్పుడు రాష్ట్రాలకు రూ. 100 కోట్లు ఇవ్వగలుగుతున్నామని చెప్పారు.  డిజిటల్ రంగంలో ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నామని తెలిపారు. జీ 20 సదస్సు నిర్వహించే అవకాశం మనదేశానికే దక్కిందని తెలిపారు.  ప్రపంచాన్ని మార్చడంలో భారత్ నిర్ణయాత్మక పాత్ర పోషించబోతున్నామన్నారు.